Share News

ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం...

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:31 PM

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చే యకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చే స్తోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆరోపించారు. చెన్నూరు ని యోజక వర్గంలో ప్రజా సమస్యలపై స్వీకరించిన దా దాపు 40వేల ఫిర్యాదులను నస్పూర్‌లోని కలెక్టరేట్‌ ఎ దుట నిరసన వ్యక్తం చేసి కార్యాలయ ఏవో రాజేశ్వర్‌ కు గురువారం అందించారు.

ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం...
కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న బాల్క సుమన్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు

కలెక్టరేట్‌ ఎదుట నిరసనలో బాల్క సుమన్‌

నస్పూర్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చే యకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చే స్తోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆరోపించారు. చెన్నూరు ని యోజక వర్గంలో ప్రజా సమస్యలపై స్వీకరించిన దా దాపు 40వేల ఫిర్యాదులను నస్పూర్‌లోని కలెక్టరేట్‌ ఎ దుట నిరసన వ్యక్తం చేసి కార్యాలయ ఏవో రాజేశ్వర్‌ కు గురువారం అందించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్‌ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో 16 రోజుల పాటు పార్టీ శ్రేణులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నె రవేర్చకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేద న్నా రు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఆధ్వానంగా మారిందని, తద్వార ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్ర తిపక్షంగా తాము ప్రశ్నిస్తున్నామని, ఇచ్చిన ఆరు గ్యా రెంటీలు, హామీలు, చెప్పిన నాలుగు డిక్లరేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేయాలని బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యే వర కు తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజక వర్గంకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 11:32 PM