విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:21 PM
విద్యాభివృద్ధికి కాం గ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని జిల్లా గ్రంథాలయ సం స్థ చైర్మన్ రాజేందర్ అన్నారు.
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్
అచ్చంపేటటౌన్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : విద్యాభివృద్ధికి కాం గ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని జిల్లా గ్రంథాలయ సం స్థ చైర్మన్ రాజేందర్ అన్నారు. మై నార్టీ సంక్షేమ దినోత్సవం పురస్క రించుకొని మంగళవారం పట్టణంలో ని మైనార్టీ పాఠశాలలో ఏర్పాటు చేసి న సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రె స్ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. విద్యార్థులు, మౌలానా అబు ల్ కలాం ఆజాద్‌ను స్ఫూర్తిగా తీసుకొని కష్టప డి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహిం చాలన్నారు. అనంతరం వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అం దజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లేష్, దర్గా కమిటీ చైర్మన్ రఫీ, నాయకులు సదాబ్ సిద్దిక్, ప్రిన్సిపాల్ యాదగిరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.