చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ABN , Publish Date - Dec 19 , 2025 | 10:31 PM
చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. శుక్రవారం చెన్నూ రులో అంబేద్కర్ కమ్యూనిటీ భవన్‌ను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు.
-రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్‌వెంకటస్వామి
చెన్నూరు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. శుక్రవారం చెన్నూ రులో అంబేద్కర్ కమ్యూనిటీ భవన్‌ను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెన్నూరు నియో జకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా చెన్నూరు మండల కేంద్రంలో రూ. 20 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో క మ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టామన్నారు. భవనం మరింత విస్తరించేం దుకు అదనంగా మరో రూ. 20 లక్షలు మంజూరు చేసి అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కమ్యూనిటీ భవనాన్ని దళిత సంఘా లు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదే తరహాలో భీమారం మండలంలో రూ. 25 లక్షలతో నేతకాని భవనం, జైపూర్ మండలంలో రూ. 25 లక్షలతో జగ్జీవన్‌రామ్ భవనం, చెన్నూరు మండలంలో రూ. 25 లక్షలతో ముదిరాజ్ భవనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా భవనాలకు అదనపు నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో రూ. 15 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టామన్నారు. వచ్చే విడతలో రూ. 70 నుంచి 80 కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. తాగునీరు అం దించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెన్నూరు ప్రాంతం లో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టామని, మే నెల వరకు ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసేందుకు, ఆసుపత్రిలో తగినంత సి బ్బంది నియామకానికి చర్యలు చేపడతామన్నారు. ప్రజలందరికి ఒకే చోట కూరగాయలు, మాంసం అందుబాటులో ఉండేలా సమీకృత మార్కెట్‌ను ఏర్పాటు చేశామని, మాంసం ఉత్పత్తులకు సంబంధించి మార్కెట్‌లో నెల కొన్న సాంకేతిక సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. చెన్నూరు ప్ర భుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి కిడ్నీ బాధితు లకు సేవలు అందిస్తామన్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో పూ ర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద న్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ అంబేద్కర్ భవనాన్ని ప్రజలు బహుళ ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చని, ఈ భవనంలో గ్రం థాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమీకృత మార్కె ట్‌లో సామూహిక సౌచాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నా రు. అనంతరం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి కొన సాగుతున్న అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో సమీ క్షించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, ఏసీపీ వెంకటేశ్వర్లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.