Share News

ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వం..

ABN , Publish Date - Apr 20 , 2025 | 10:55 PM

కాంగ్రెస్‌ పాలనలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం అధిష్టానం చుట్టూ తిరు గుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సు మన్‌ విమర్శించారు.

ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వం..

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌

నస్పూర్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ పాలనలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం అధిష్టానం చుట్టూ తిరు గుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సు మన్‌ విమర్శించారు. నస్పూర్‌లోని బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాల యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎ న్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను, ఆరు గ్యా రెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నా రు. ముగ్గురు ఎమ్మెల్యేలు పదవుల కోసం ఆరాట పడుతున్నారే త ప్ప జిల్లా అభివృద్ధికి పని చేయడం లేదన్నారు. ప్రభుత్వ పాలన తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. రానున్న రోజు ల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల తగిన గుణపాఠం చెబుతారన్నారు. చె న్నూరులో మైనింగ్‌, ఇసుక మాఫీయా ఆగడాలు మితిమీరిపోయా యని, ఇంతా జరుగుతున్న అధికారుల్లో ఏ మాత్రం కదలిక లేకుం డా పోయిందన్నారు. చెన్నూరు నియోజక వర్గంలో ఎమ్మెల్యే వివేక్‌ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. బీ ఆర్‌ఎస్‌ సభకు జిల్లా నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని బాల్క సుమన్‌ పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ అద్యక్షుడు అక్కురి సుబ్బయ్య, నాయకు లు నడిపెల్లి విజిత్‌ రావు, లక్ష్మన్‌, సంపత్‌, భూమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 10:55 PM