Share News

kumaram bheem asifabad- సంపూర్ణత అభియాన్‌ లక్ష్యాలు సాధించాలి

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:27 PM

సంపూర్ణత అభియాన్‌ లక్ష్యాలు ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో కృషి చేసి సాధించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి సంపూర్ణత అభియాన్‌లో భాగంగా జిల్లా బ్లాక్‌, తిర్యాణి బ్లాక్‌ పరిధిలోని క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- సంపూర్ణత అభియాన్‌ లక్ష్యాలు సాధించాలి
డీపీవో భిక్షపతిగౌడ్‌కు ప్రశంసాపత్రం అందజేస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): సంపూర్ణత అభియాన్‌ లక్ష్యాలు ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో కృషి చేసి సాధించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి సంపూర్ణత అభియాన్‌లో భాగంగా జిల్లా బ్లాక్‌, తిర్యాణి బ్లాక్‌ పరిధిలోని క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నీతి ఆయోగ్‌ విభాగం ఆస్పరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రాం (ఏబీపీ)లో తిర్యాణి బ్లాక్‌ను జాతీయస్థాయిలో ఐదో ర్యాంకు, దక్షిణాది రాష్ట్రాలలో మొదటి ర్యాంకు సాధించడానికి కృషి చేసిన క్షేత్రస్థాయి కృషి చేసిన ప్రతి ఉద్యోగి, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తిగా బ్లాక్‌లను ఆకాంక్షత నుంచి అభివృద్ధి దిశలో తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలన్నారు. సంపూర్ణత అభియాన్‌ పథకం కింద వైద్య, విద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధి, గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు. వైద్య శాఖ ఆద్వర్యంలో 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌, క్యాన్సర్‌ వంటి వ్యాధుల పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేసి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భూసార పరీక్షలు నిర్వహించి కార్డులు జారీ చేయడం తదితరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీపీవో భిక్షపతిగౌడ్‌తో పాటు ఇతర అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, గిరిజన సంక్షేమాధికారిణి రమాదేవి, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, ఎంపీడీవో మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 11:27 PM