మహిళా రక్షణే షీటీం ధ్యేయం
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:08 PM
మహిళల, బాలికల రక్షణే షీ టీం ధ్యేయమని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అ న్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం పోలీసు కమిషనరే ట్ పరిధిలో రెండు షీఈం బృంధాలు పనిచేస్తున్నాయన్నారు.
- సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల కైరం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి) : మహిళల, బాలికల రక్షణే షీ టీం ధ్యేయమని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అ న్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం పోలీసు కమిషనరే ట్ పరిధిలో రెండు షీఈం బృంధాలు పనిచేస్తున్నాయన్నారు. పాఠశాలలు, కా లేజీల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ఫోక్సో, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆత్మహత్యలు, డ్రగ్స్, బాల్య వివాహాలు, వరకట్న చట్టాలపై, నూతన మహిళా చట్టాలపై, డ యల్ 100, ఈ సేఫ్ యాప్, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నామ న్నారు. సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, ఆన్‌లైన్ క్యూఆర్ కో డ్ వాట్సప్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. మహిళలు, బాలికల పై ఆన్‌లైన్‌లో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై, సైబర్ నేరగాళ్లపై, సైబర్ షీ టీం సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థి తుల్లో 8712659386 లేదా 100కు డయల్ చేయాలన్నారు. సెప్టెంబర్‌లో మొ త్తం 65 ఫిర్యాదులు అందాయని, అందులో 59 కేసులను రెడ్ హ్యాండెడ్‌గా ప ట్టుకున్నామన్నారు. మహిళలు, విద్యార్థులు ప్రతీ ఒక్కరు భయ పడకుండా స మస్యలు తలెత్తినప్పుడు షీటీంను సంప్రదించాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచి వారికి న్యాయం చేస్తామని అన్నారు.