మహిళల సాధికారతే లక్ష్యం
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:07 PM
మహిళల సాధికారత, అభి వృద్ధే లక్ష్యమని సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు శ్రీవాణిరాధాకృష్ణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సీఈఆర్‌క్లబ్‌లో టైలరింగ్, మగ్గంవర్కు, బ్యూటిషియన్ ఉచిత శిక్షణ తరగతుల ప్రారంభానికి అతిథిగా హాజరై మాట్లాడారు.
మందమర్రిటౌన్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మహిళల సాధికారత, అభి వృద్ధే లక్ష్యమని సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు శ్రీవాణిరాధాకృష్ణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సీఈఆర్‌క్లబ్‌లో టైలరింగ్, మగ్గంవర్కు, బ్యూటిషియన్ ఉచిత శిక్షణ తరగతుల ప్రారంభానికి అతిథిగా హాజరై మాట్లాడారు. సేవా సమితి ఆధ్వర్యంలో వేలాది మంది మహిళలకు ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వగా వారు ఉపాధి పొందుతున్నారన్నారు. ఇప్పటి వరకు చాలా మంది మహిళలు శిక్షణ పొంది సొంతంగా షాపులను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందు తున్నారన్నారు. మహిళల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సేవా సమితి ముందుంటుందన్నారు. ఈ శిక్షణ కోర్సులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.