ప్రజలకు నాణ్యమైన కరెంటు ఇవ్వడమే లక్ష్యం
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:08 PM
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ల క్ష్యంగా పని చేస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈ శ్రీధర్‌శెట్టి అన్నారు.
- విద్యుత్ డీఈ శ్రీధర్
కందనూలు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ల క్ష్యంగా పని చేస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈ శ్రీధర్‌శెట్టి అన్నారు. నాగర్‌కర్నూల్ మునిసిపా లిటీ పరిధిలో హౌసింగ్‌బోర్డులోని 22వ వార్డులో కరెంటు సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి స్తం భాల మార్చుట పరిశీలించి తక్షణమే మరమ్మ తులను చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ము ఖ్యమంత్రి ఆదేశానుసారం విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌నందించేందుకు చర్యలు తీసుకుంటున్న ట్లు ఆయన పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లతోపాటు విద్యుత్ లైన్లు స్తంభాలు, వైర్లు సమస్యలు ఎక్క డున్నా తక్షణమే గుర్తించి మరమ్మతులు చేప ట్టేందుకు బస్తీబాట చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో 22వ మాజీ కౌన్సిలర్ తీగల సునేంద్రకుమార్, కాలనీవా సులు అమీర్ అహ్మద్, కృష్ణమా చారి, అబ్దుల్ సమద్, మహమ్మ ద్ ఖాజామియా, శంకరయ్య, కాల నీవాసులు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.