Share News

ప్రజాపాలన అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:23 PM

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సుస్థిర పాలన అందించే లక్ష్యంతో కాంగ్రెస్‌పార్టీ పనిచేస్తుందని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

ప్రజాపాలన అందించడమే లక్ష్యం

- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

వెల్దండ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సుస్థిర పాలన అందించే లక్ష్యంతో కాంగ్రెస్‌పార్టీ పనిచేస్తుందని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని తిమ్మినోనిపల్లి గ్రామంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలపర్చిన అభ్యర్థి ముడావత్‌ శారదకు మద్దతుగా నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేస్తూ ప్రజాపాలన అందిస్తున్నామన్నారు. గ్రామాలలో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో ముందుకుసాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు గ్రామాలలో సర్పంచ్‌లుగా గెలిస్తే అభివృద్ది మరింత ముందుకుసాగుతుందని పేర్కొన్నారు. గ్రామంలోని విద్యుత్‌, రోడ్డు వంటి ప్రధాన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం స్థానికంగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి నారాయణరెడ్డి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రాంచంద్రారెడ్డి, నాయకులు హరికిషన్‌నాయక్‌, శ్రీధర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:23 PM