ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:53 PM
నియోజికవర్గ ప్రజలకు ఒక్క పైసా ఖర్చు లేకుండా కార్పొరేటుకు దీటుగా ఉచిత విద్య, వైద్యం రెండు అందించడమే లక్ష్యం అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
12న పాఠశాల, కళాశాల నూతన భవనాల ప్రారంభం
లక్షెట్టిపేట, జూన్ 10(ఆంధ్రజ్యోతి): నియోజికవర్గ ప్రజలకు ఒక్క పైసా ఖర్చు లేకుండా కార్పొరేటుకు దీటుగా ఉచిత విద్య, వైద్యం రెండు అందించడమే లక్ష్యం అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఈనెల 12వ తేదీన లక్షెట్టిపే ట పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ కళాశాల, పాఠశాల భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే సంబంధిత అధికారులు, నాయకులతో కలిసి వాటిని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రారంభోత్స వానికి ప్రతీ ఒక్కరూ తప్పకుండా రావాలని ముఖ్యంగా ఇందు లో చదివిన పూర్వ విద్యార్థులు ఈభవనాల ప్రారంభోత్సవంలో పాలు పంచుకోవాలని కోరారు. తాను ఇదే పాఠశాలలో 1974వ సంవత్సరంలో విద్యను అభ్యసించిన సందర్భంగా అప్పటి ఙ్ఞాప కాలను తన స్నేహితులు, అధికారులకు గుర్తు చేసారు. ఉపా ధ్యాయులు సైతం మన ప్రాంతంలోని వివిధ పాఠశాలల విద్యా ర్థులను పెద్ద సంఖ్యలో తీసుకురావాలని ఏటా ఇందులో విద్యా ర్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. గతం లో ఉన్న కళాశాల, పాఠశాల కాదని ఇక్కడ ఇప్పుడు అన్ని రకా ల వసతులతో పాటు అధునాతనమైన ల్యాబ్‌లు, అనుభవం కలి గిన పూర్తి స్థాయిలో సిబ్బందిని కూడా నియమించినట్లు తెలి పారు. తాను గెలిచిన తర్వాత తను చదువుకున్న పాఠశాల, కళా శాలను నిర్మించే భాగ్యం తనకు లభించడం అదృష్టంగా బావి స్తున్నానన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా విద్యాధికారి యాద య్య, డీఐవో ప్రభాకర్, ఎంపీడీవో సరోజ, ఎమ్మార్వో దిలీప్‌కు మార్, ప్రిన్సిపల్స్ రమాకళ్యాణి, లక్ష్మణ్‌రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అద్యక్షుడు ఆరీఫ్, మండల అధ్యక్షుడు పింగిళి రమే ష్, ఆర్టీఏ మెంబర్ అంకతి రమేష్, జిల్లా నాయకులు అశోక్, పూ ర్ణచందర్‌రావు, త్రిమూర్తి, నాయకులు పాల్గొన్నారు.