Share News

కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:12 PM

జిల్లా ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకేళ్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావు అ న్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరాస్తాలో జరు గుతున్న ప్రభుత్వ సూపర్‌ స్పెషాలీలటీ ఆసుపత్రి నిర్మాణ పను లను ఆయన పరిశీలించారు.

కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యం
అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావు

మంచిర్యాల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లా ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకేళ్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావు అ న్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరాస్తాలో జరు గుతున్న ప్రభుత్వ సూపర్‌ స్పెషాలీలటీ ఆసుపత్రి నిర్మాణ పను లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రతీ వైద్యానికి ప్రజలు హైదరాబాదుకు వెళ్లాల్సి వస్తుందని ఆ అవసరం ఉండకూడదనే ఉద్దేశంతో రూ. 324 కోట్లతో సూపర్‌ స్పెషాటీలీ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. 2027 లోగా ఆసు పత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలను అందుబాటు లోనికి తేనున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరిత గతిన పూర్తి అయ్యేలా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వైవ్యసేవలు అందు బాటులోనికి వస్తే జిల్లాతో పాటూ పొరుగు జిల్లా అయిన ఆసి ఫాబాద్‌, మహారాష్ట్ర ప్రజలకు నాణ్యమైన, ఉచిత వైద్య సేలవలు అందుతాయన్నారు. ఈ సంర్భంగా ఆసుపత్రి నమూనా, ఇతర సౌ కర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.. అంతకు ముం దు గోదావరి రోడ్‌లో నిర్మించిన అధునాతన వైకుంఠ ధామాన్ని స్థానిక నాయకులతో కలసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయన వెంట పలువురు కాంగ్రేస్‌ నాయకులు, మాజీ కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 11:12 PM