kumaram bheem asifabad- పేదలకు గూడు కల్పించడమే లక్ష్యం
ABN , Publish Date - Nov 22 , 2025 | 10:43 PM
పేదలకు గూడు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో ఆసిఫాబాద్ ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన మండలంలోని పీవీటీజీ లబ్ధిదారులకు పీఎం జన్‌మన్ కింద ఇళ్ల మంజూరు పత్రాలను కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి అందజేశారు.
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పేదలకు గూడు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో ఆసిఫాబాద్ ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన మండలంలోని పీవీటీజీ లబ్ధిదారులకు పీఎం జన్‌మన్ కింద ఇళ్ల మంజూరు పత్రాలను కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి అందజేశారు. జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పీఎం జన్‌మన్ ద్వారా ప్రతి పేద గిరిజనులకు ఇళ్లు అందించడమే లక్ష్యమన్నారు. ప్రస్తుతం విడతలో ఇళ్లు రాని వారికి భవిష్యత్‌లో అందించనున్నామని చెప్పారు. పీవీటీజీల అభివృద్ధికి వారి వారి గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇప్పటికే మల్టీ పర్పస్ సెంటర్లను ఏర్పాటు చేశామని వివరించారు. వీటిలో అంగన్‌వాడీ, హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హాల్, లైబ్రరీ లాంటి సేవలన్ని ఒకే చోట లభిస్తున్నాయని అన్నారు. పేద గిరిజనులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అంతకు ముందు కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ జిల్లాలో 2,169 ఇళ్లు మంజూరు అయ్యాని తెలిపారు. వీటిలో అత్యధికంగా ఆసిఫాబాద్, తిర్యాణి మండలాలకు మంజూరైనట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణాలలో ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణానికి కావాల్సి అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందవని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ మండలంలో 543 ప్రతిపాదనలు పంపించామని 449 మంజూరయ్యాని చెప్పారు. మిగితావి కూడా మంజూరు చేయించడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, హౌసింగ్ పీడీ ప్రకాష్, డీఈ వేణుగోపాల్, పీఏసీఎస్ చైర్మన్ అలీబీన్ అహ్మద్, మాజీ జడ్పీటీసీ నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ మల్లికార్జున్ పాల్గొన్నారు.
తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడమే కేంద్ర ప్రభుత్వ లభ్యమని, ఆదిమ గిరిజనులకు అన్ని వసతులు కల్నిస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. తిర్యాణి మండలంలోని సుంగాపూర్ గ్రామ పంచాయతీలో పీవీటీజీ లబ్ధిదారులకు పీఎం జన్‌మన్ కింద నిర్వహించి ఇళ్ల్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలానికి వచ్చిన ఆయనకు పార్టీ అధ్యక్షుడు రమేష్‌గౌడ్, నాయకులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సుంగాపూరలోని కోలాం గిరిజనుల ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం తిర్యాణి ఎంపీడీవో వేముల మల్లేష్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో నిర్వహించి సమావేశానికి హాజరై లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, హౌసింగ్ పీడీ ప్రకాష్, డీఈ వేణుగోపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ మల్లికార్జున్, బీజేపీ నాయకులు విజయ్, జగదీష్, శ్రీదేవి, చంద్రశేఖర్, కమల, గుణవంతరావు, సొల్లు లక్ష్మి, వెంకటేష్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.