Share News

గర్భాశయ క్యాన్సర్‌ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:15 PM

జిల్లాను గర్భాశయ క్యాన్సర్‌ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా వైద్యా రోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.

గర్భాశయ క్యాన్సర్‌ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ రవికుమార్‌

- డీఎంహెచ్‌వో రవికుమార్‌

కందనూలు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాను గర్భాశయ క్యాన్సర్‌ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా వైద్యా రోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. జిల్లా వైద్యారోగ్య సమావేశ మందిరంఓ ఫార్మసీ ఆఫీసర్లు, కోల్డ్‌ చైన్‌ హ్యాండర్లకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ని ల్వ, రవాణాపై నిర్వహించిన శిక్షణా కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హెచ్‌పీ వీ వ్యాక్సిన్‌ వాడకం గురించి వారికి అవగాహ న కల్పించారు. 14 ఏళ్ల వయస్సు బాలికలంద రికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అందేలా చర్యలు తీసుకో వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ మాస్‌ మీడియా అధికారి రాజగోపలా చారి, ఓ.శ్రీనివాసులు, ఫార్మసీ ఆఫీస ర్‌ సురేష్‌, జిల్లా వ్యాక్సిన్‌స్టోర్‌ మేనేజర్‌ కుమార్‌, వీసీసీఎం దివ్యతోపాటు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల ఫార్మసీ ఆఫీసర్లు, కోల్డ్‌ చైన్‌ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 11:15 PM