Share News

విద్యార్థుల నమోదు పెంపుదలే లక్ష్యం

ABN , Publish Date - May 22 , 2025 | 11:15 PM

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచే దిశ గా ఉపాధ్యాయులు కృషి చేయాలని, దీని కోసం నాణ్యమైనవిద్యను అందించడమే ప్రధాన లక్ష్యం అని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

విద్యార్థుల నమోదు పెంపుదలే లక్ష్యం
కొల్లాపూర్‌ ఉపాధ్యాయుల శిక్షణలో మాట్లాడుతున్న డీఈవో రమేష్‌

- ఉపాధ్యాయుల శిక్షణలో డీఈవో రమేష్‌ కుమార్‌

కొల్లాపూర్‌, మే 22 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచే దిశ గా ఉపాధ్యాయులు కృషి చేయాలని, దీని కోసం నాణ్యమైనవిద్యను అందించడమే ప్రధాన లక్ష్యం అని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. కొల్లాపూర్‌లోని జిల్లా పరిషత్‌ బా లికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుని ఉపా ధ్యాయులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని గురువారం డీఈవో సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నా, ప్రభుత్వ పాఠశాలలను నిలబెట్టి విద్యను అందరికీ అందే విధంగా కృషి చేయాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని తరగ తి గదిలో వినియోగించడం, మౌలిక భాష, గణిత అభివృద్ధి కార్యక్ర మాన్ని కృత్రిమ మేధా ఆధారంగా అభివృద్ధి పరచడం, పాఠశాల విద్య లో నూతనంగా ప్రవేశ పెట్టబడుతున్న కృత్రిమ మేధా పాఠ్యాంశాలను పిల్లలకు అందించ డం అనే మూడు నూతన విషయాలతో ఎఫ్‌ఎల్‌ ఎన్‌ శిక్షణ రూపొందించ బడిందని దీన్ని ఉపాధ్యా యులు అందిపుచ్చుకొని ప్రభుత్వ పాఠశాల విద్యా భివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమం లో మండల యంఈ వో ఇమ్మానుయేల్‌ రిసోర్స్‌ పర్సన్లు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు .

ఫ పెంట్లవెల్లి : మారుతున్న కాలానికి అను గుణంగా నూతన బోధన పద్ధతులను అవలం భించాలని డీఈవో రమేష్‌కుమార్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో వృత్తి నైపుణ్యాల శిక్షణ శిక్షణ శిభిరానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంఈవో ఇమ్మాన్యుయేల్‌ పాల్గొన్నారు.

ఫ పెద్దకొత్తపల్లి : నాణ్యమైన విద్యనందించి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని నాగ ర్‌కర్నూల్‌ జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌ కుమా ర్‌ ఉపాధ్యాయులకు పిలుపనిచ్చారు. గురువా రం పెద్దకొత్తపల్లి జడ్పీ హైస్కూల్‌ల్లో జరుగు తున్న మండలస్థాయి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రా న్నిఆయన సందర్శించారు. కార్యక్రమంలో ఎంఈ వో కే.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్పీలు సాయిప్రకాశ్‌రెడ్డి, మహేష్‌బాబు, లక్ష్మీపతి, సువర్ణ, శివ, ప్రమీల, లోకేశ్వరి, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ స్వామి, కంప్యూ టర్‌ ఆపరేటర్‌ శివలింగం, సీఆర్పీలు ఈశ్వర్‌, రాముయాదవ్‌ పాల్గొన్నారు.

ఫ అమ్రాబాద్‌ : అమ్రాబాద్‌లోని జడ్పీహెచ్‌ ఎస్‌లో ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహి స్తున్న ఉపాధ్యాకులుకు బోధన పద్ధతులు మెరు గుదల కోసం విద్యాశాఖ ద్వారా మంగళవారం నుంచి ఐదు రోజులు పాటు నిర్వహించే శిక్షణ శిబిరం కొనసాగుతోంది. కార్యక్రమంలో శిక్షణ కో ఆర్డినేటర్‌ ఎంఈవో బాలకిషన్‌, రిసోర్స్‌ పర్సన్స్‌, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 11:15 PM