Share News

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:28 PM

గత ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలపరుస్తామని చెప్పి పట్టించుకోలేదని, మహిళలను ఆర్థి కంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కిష్టంపేట గ్రామంలోని బీఎంఆర్‌ గార్డెన్‌లో నిర్వహిం చిన ఇందిర మహిళ శక్తి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. సుమారు 246 మహిళ సంఘాలకు రూ. 25 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు కలిసి పంపిణీ చేశారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం

-మంత్రి వివేక్‌వెంకటస్వామి

చెన్నూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : గత ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలపరుస్తామని చెప్పి పట్టించుకోలేదని, మహిళలను ఆర్థి కంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కిష్టంపేట గ్రామంలోని బీఎంఆర్‌ గార్డెన్‌లో నిర్వహిం చిన ఇందిర మహిళ శక్తి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. సుమారు 246 మహిళ సంఘాలకు రూ. 25 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు కలిసి పంపిణీ చేశారు. అలాగే కొత్తగా మం జూరైన రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష కోట్ల నిధులను వృథా చేసిందన్నారు. ప్రాజెక్టుతో కాంట్రాక్టర్లు ధనవం తులయ్యారన్నారు. ఈ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో పంటలు మునిగిపో యి రైతులు నష్టపోయారని, దీంతో నష్ట పరిహారం ఇవ్వాలని గత ప్ర భుత్వంతో తాను కొట్లాడానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎ న్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. వడ్డీ లే ని రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎద గాలన్నారు. అర్హులైన వారం దరికి ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని తెలిపారు. చెన్నూరు నుంచి కొత్తగా ఐదు బస్సులను ప్రారంభించామని, చెన్నూరులో బస్‌ డిపో ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రిని కోరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, డీఆర్‌డీవో కిషన్‌, తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఎంపీ డీవో మోహన్‌, ఐకేపీ సిబ్బంది, మహిళ ంఘాల సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:28 PM