kumaram bheem asifabad- గిరిజనుల సమగ్రాభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Sep 25 , 2025 | 10:58 PM
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆదికర్మ యోగి పథకం ద్వారా గిరిజనుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి విహునాయర్ అన్నారు. న్యూఢిల్లీలోని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి గురువారం ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణలోని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, గిరిజన సంక్షేమాధికారులతో సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆదికర్మ యోగి పథకం ద్వారా గిరిజనుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి విహునాయర్ అన్నారు. న్యూఢిల్లీలోని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి గురువారం ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణలోని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, గిరిజన సంక్షేమాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. గిరిజన ప్రాంతాలలో రహదారులు, పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, అంగన్‌వాడీ కేంద్రాలలో వసతులు, ప్రతీ గ్రామానికి విద్యుత్ సౌకర్యం, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాల కోసం కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. గిరిజన గ్రామాలలో ఆది సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి అదనపు కలెక్టర్ దీపక్ తివారి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆది కర్మయోగి పథకం అమలులో భాగంగా జిల్లాలోని 12 మండలాలో గల 102 గిరిజన గ్రామాలల్లో బ్లాక్ స్థాయి మాస్టర్ ట్రైనర్లు, విద్యాశాఖాధికారులతో గ్రామ స్థాయిలో శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. విద్య, వైద్యం, గిరిజన సంక్షేమం, తాగునీరు, విద్యుత్, వ్యవసాయ రంగాల అభివృద్ధి, రహదారుల నిర్మాణాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందంచి గిరిజన గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్ధిలో భాగంగా 2030 సంవత్సరం వరకు కార్యాచరణ రూపొందిస్తున్నామని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, వైద్య శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నార