Share News

కల్వకుర్తి సమగ్రాభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Jun 05 , 2025 | 11:45 PM

కల్వకుర్తి సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పట్టణాభివృద్ధికి కావాల్సిన నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుం దని ఆయన పేర్కొన్నారు.

కల్వకుర్తి సమగ్రాభివృద్ధే లక్ష్యం
పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పట్టణాభివృద్ధికి కావాల్సిన నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుం దని ఆయన పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణంలో గురువారం పలు సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణా లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. భగత్‌సింగ్‌ తండాలో రూ.15లక్షలు, కేశవనగర్‌లో రూ.25లక్ష లు, రాఘవేంద్రకాలనీలో రూ.22లక్షలు, బాలరా మ్‌నగర్‌లో సీసీరోడ్లు, 8వ వార్డు సుభాష్‌నగ ర్‌లో రూ.25లక్షలు, ప్రభుత్వ పాఠశాల ఆవరణ లో పది లక్షలతో నిర్మించే డ్రైనేజీలకు, సీసీ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వన మహోత్సవంలో భాగం గా మొక్కలు నాటారు. అ నంతరం పోలీస్‌ స్టేషన్‌ స మీపంలో మునిసిపల్‌ మెప్మా ఆధ్వర్యంలో చేతి వృత్తులద్వారా ఏర్పాటు చే సిన స్టాల్స్‌ను సందర్శించా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాసంక్షేమం, అభి వృద్ధే లక్ష్యంగా సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి నా యకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుం దని తెలిపారు. కల్వకుర్తిలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇది వరకే సీసీ రోడ్లు, డ్రైనేజీలు ని ర్మించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు బృంగి ఆనంద్‌కుమార్‌, పసుల సుద ర్శన్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ మహమ్మద్‌ షేక్‌, కాంగ్రెస్‌ పట్టణఅధ్యక్షుడు చిమ్ముల శ్రీకాం త్‌రెడ్డి, నాయకులు సంజీవ్‌కుమార్‌యాదవ్‌, ప లువురు మాజీకౌన్సిలర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయ కులు, ఆయా కాలనీల ప్రజలు ఉన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 11:45 PM