Share News

శాంతియుత ఎన్నికలే లక్ష్యం

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:35 PM

శాంతియుత ఎన్నికల లక్ష్యంగా సిబ్బంది విధులు నిర్వ ర్తించాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎన్నికల డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రాన్ని సం దర్శించారు. పోలింగ్‌ బూత్‌లలో భద్రత, రూట్‌ మొబైల్‌ టీంలు, రూట్‌ ఇన్‌చార్జీలు, క్యూఆర్‌టీ, స్ర్టైకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ర్టైకింగ్‌ ఫోర్స్‌ అన్ని రకాల ప్రత్యేక బృందాలు చేపట్టాల్సిన, నివారించాల్సిన అంశాలను స్పష్టంగా వివ రించారు.

శాంతియుత ఎన్నికలే లక్ష్యం

మంచిర్యాల డీసీపీ భాస్కర్‌

జైపూర్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : శాంతియుత ఎన్నికల లక్ష్యంగా సిబ్బంది విధులు నిర్వ ర్తించాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎన్నికల డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రాన్ని సం దర్శించారు. పోలింగ్‌ బూత్‌లలో భద్రత, రూట్‌ మొబైల్‌ టీంలు, రూట్‌ ఇన్‌చార్జీలు, క్యూఆర్‌టీ, స్ర్టైకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ర్టైకింగ్‌ ఫోర్స్‌ అన్ని రకాల ప్రత్యేక బృందాలు చేపట్టాల్సిన, నివారించాల్సిన అంశాలను స్పష్టంగా వివ రించారు. ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియా మవళి ఉల్లంఘనలను కఠినంగా పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకోవా లన్నారు. అభ్యర్ధులు, ఏజెంట్లు రాజకీయ కార్యకర్తల ఒత్తిడి, ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్‌ కేం ద్రాల వద్ద అనుమానస్పద వ్యక్తులు, వాహనాలు, మద్యం, డబ్బు, ఉచి తాల పంపిణీ వంటి అక్రమాలపై నిఘా పెట్టాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్చగా భయం లేకుండా ఓటు వేయగల వాతావరణాన్ని కల్పించాలని, చిన్న గొడవై నా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించి శాంతి భద్రతలకు భంగం కలుగకుండా చూడాలన్నారు. జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌, సీఐ నవీన్‌ కు మార్‌, శ్రీరాంపూర్‌ సీఐ శ్రీలత, జైపూర్‌ ఎస్‌ఐ శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 11:35 PM