రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
ABN , Publish Date - Oct 21 , 2025 | 10:50 PM
రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా దుబాయ్‌లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అక్కడి ప్రతినిధుల తో మంగళవారం సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో పారిశ్రామిక పెట్టుబడుల కోసం అత్యంత అనుకూలమని ప్రాం తాలు అని ప్రతినిధులకు వివరించానని తెలిపారు.
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
మందమర్రిటౌన్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా దుబాయ్‌లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అక్కడి ప్రతినిధుల తో మంగళవారం సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో పారిశ్రామిక పెట్టుబడుల కోసం అత్యంత అనుకూలమని ప్రాం తాలు అని ప్రతినిధులకు వివరించానని తెలిపారు. బొగ్గు, విద్యుత్, రైల్వే, రోడ్ల మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పానని తెలిపారు. ఈ ప్రాం తాల్లో పెట్టుబడులు పెడితే బాగా ఉంటుందని చెప్పానని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్ సెక్టార్ తదితరవాటిలో పెట్టుబడుల కోసం ప్రతినిధుల తో వివరించానని తెలిపినట్లు ఎంపీ పేర్కొన్నారు.