Share News

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:14 PM

కల్వకు ర్తి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : కల్వకు ర్తి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌ యా ర్డులో రూ.2.70కోట్లతో నిర్మించే రూపింగ్‌ షెడ్డు కు, రూ.49లక్షలతో నిర్మించే షాపింగ్‌ కాంప్లెక్స్‌ మరమ్మతు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మార్కెట్‌ చైర్మన్‌ మనీలాసంజీవ్‌ కుమా ర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కల్వకుర్తిలో వంద పడ కల ఆసుపత్రి నిర్మాణం, పేదలకు రేషన్‌కార్డుల పంపిణీ, ఆమనగల్‌లో 50పడకల ఆసుపత్రి నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపడుతున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో పొల్యూషన్‌ కం ట్రోల్‌ బోర్డుమాజీ సభ్యుడు ఠాకూర్‌ బాలాజీ సింగ్‌, నాయకులు సంజీవ్‌కుమార్‌యాదవ్‌, విజ య్‌కుమార్‌రెడ్డి, భూపతిరెడ్డి, వెంకటయ్య యాద వ్‌, డిప్యూటీ ఈఈ బసవలింగం, మా ర్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రమాకాంత్‌ రెడ్డి, డైరెక్టర్లు ఉన్నారు.

రోడ్ల అభివృద్ధికి పెద్దపీట : ఎమ్మెల్యే

చారకొండ : గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ నిధుల నుంచి రూ. 9 కోట్లతో మం డలంలోని జూపల్లి నుంచి వంగూరు గేట్‌ వరకు 3.2కిలో మీటర్ల మేర మంజూరైన రెండు వరుసల బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ నుంచి రూ. 2.70 కోట్లతో జూపల్లి నుంచి నెమలిగు ట్టతండా 3.2కిలో మీటర్ల వరకు నిర్మాణం పూర్తి అయిన నూతన బీటీ రోడ్డును శనివారం ఎమ్మె ల్యే ప్రారంభించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర ్లను ఆదేశించారు. 25 మందికి రేషన్‌ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మాజీ సభ్యుడు ఠాగూర్‌ బాలాజీసింగ్‌, మార్కెట్‌ కమిటీ డైరక్టర్‌ ముస్తఫాముజ్జు, డీసీసీ ఉపాధ్యక్షుడు జూపల్లి వెంకటయ్యయాదవ్‌, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు మల్లెపల్లి జగన్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జమ్మికింది బాలరాంగౌడ్‌, అచ్చంపేట, కల్వకుర్తి బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు గుండె వెంకట్‌గౌడ్‌, కాయితి విజయ్‌కుమార్‌రెడ్డి, వెల్దండ మాజీ స ర్పంచ్‌ భూతిరెడ్డి, సంజీవ్‌యాదవ్‌, డీసీసీ ప్రధా న కార్యదర్శి బాలరాజు, మాజీ వైస్‌ ఎంపీపీ బాదగోని సాంబయ్యగౌడ్‌, నర్సింహారెడ్డి, రాములు యాదవ్‌, నూర్‌పాల్‌నాయక్‌, సీరాజ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 11:14 PM