Share News

యువత భవిష్యత్తుకు ప్రాధాన్యమివ్వాలి

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:15 PM

యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా భవిష్య త్తుపై దృష్టి సారించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌లు అన్నారు.

యువత భవిష్యత్తుకు ప్రాధాన్యమివ్వాలి

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్చ్‌

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా భవిష్య త్తుపై దృష్టి సారించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌లు అన్నారు. జిల్లా కేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్‌ వ్యతిరే క అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. డ్రగ్స్‌ రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు మత్తుపదార్థాలకు లోనుకా కుండా తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టా లని సూచించారు. డ్రగ్స్‌ వాడకం చదువుపై ప్ర తికూల ప్రభావం చూపడంతోపాటు శారీరక మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని, వ్యస నానికి లోనైన వారు నేరాలకు పాల్పడే అవకాశం పెరుగుతుందని వారు హెచ్చరించా రు. డ్రగ్స్‌ గురించి ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే 100లేదా 112కు సమాచారమివ్వాలని ప్రజలకు సూచించారు. అనంతరం డ్రగ్స్‌ రహిత అవగాహన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన డ్రగ్స్‌ రహితపై చిత్రలేఖన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఇద్దరు విద్యార్థులకు బహు మతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ మదన్‌మోహన్‌, డీఎస్పీ బుర్రి శ్రీని వాసులు, సీనియర్‌ లెక్చరర్లు అకాడమిక్‌ మానిటరింగ్‌ కో ఆర్డినేటర్‌ అంజయ్య, కళాశాల యాంటీ డ్రగ్‌ కోఆర్డినేటర్‌ వనతి, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ గోవర్ధన్‌, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 11:15 PM