Share News

విద్యార్థుల చేతుల్లో దేశ భవిష్యత్‌

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:20 PM

దేశ భవిష్యత్‌ విద్యార్థుల చేతుల్లో ఉందని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. నస్పూర్‌ పట్టణం సీసీసీ లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు శుక్ర వారం ముగిసాయి.

విద్యార్థుల చేతుల్లో దేశ భవిష్యత్‌

ఫ అదనపు కలెక్టర్‌ చంద్రయ్య ఫ ముగిసిన వైజ్ఞానిక ప్రదర్శన

నస్పూర్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : దేశ భవిష్యత్‌ విద్యార్థుల చేతుల్లో ఉందని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. నస్పూర్‌ పట్టణం సీసీసీ లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు శుక్ర వారం ముగిసాయి. ఆయా విభాగాల్లో విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు లు ఆకట్టుకున్నాయి. ఇన్స్‌స్పైర్‌ విభాగంలో 11 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి, బాల వైజ్ఞానిక ప్రదర్శనలో 28 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికైయ్యాయి. ఆయా విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందుకున్నారు. టీ చర్‌ టీఎల్‌ఎం విభాగంలో ఇద్దరు ఉపాధ్యాయులు జి. శ్రీనివాస్‌, ఇ. మహే ష్‌లు రాష్ట్ర స్థాయికి ఎంపికైయ్యారు. ముగింపు సమావేశానికి ముఖ్య అధితిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య ఆయా విభాగాల్లో ప్రతిభ కన బర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు కూడా విద్యాభివృద్ధి కోసం అనేక నిధులు కేటా యించడంతో విద్యాలయాల్లో సౌకర్యాలు మెరుగు పడ్డాయన్నారు. విద్యార్థులు అయా రంగాల్లో ప్రతిభ కనబర్చి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. అం తకు ముందుగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ ముగిం పు సమావేశంలో డీఈవో యాదయ్య, జిల్లా సైన్స్‌ అధికారి రాజా గోపాల్‌, ఎం ఈవో పద్మజా, ప్రైవేట్‌ పాఠశాల నిర్వహకులు సతీష్‌ రెడ్డి, సిద్ద య్య, రాజేం ద్రపాణి, రామకృష్ణరెడ్డి, రామకృష్ణ, ఉపేందర్‌, దేవన్న పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 11:20 PM