kumaram bheem asifabad- రోబోటిక్స్‌తోనే భవిష్యత్తు
ABN , Publish Date - Dec 30 , 2025 | 10:23 PM
రోబోటిక్స్‌తోనే చక్కటి భవిష్యత్తు ఉంటుందని ఎస్పీఎం వైస్ ప్రెసిడెంట్ ఏకే మిశ్రా అన్నారు. కాగజ్‌నగర్ జవహార్ నవోదయా విద్యాలయంలో విద్యార్ధులు ఏర్పాటు చేసిన రోబోటిక్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి, విద్యార్ధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. వర్తమానం కాలంలో ప్రతి రంగంలో పోటీ పెరుగుతుందన్నారు. రోబోటిక్స్‌తో పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
కాగజ్‌నగర్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రోబోటిక్స్‌తోనే చక్కటి భవిష్యత్తు ఉంటుందని ఎస్పీఎం వైస్ ప్రెసిడెంట్ ఏకే మిశ్రా అన్నారు. కాగజ్‌నగర్ జవహార్ నవోదయా విద్యాలయంలో విద్యార్ధులు ఏర్పాటు చేసిన రోబోటిక్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి, విద్యార్ధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. వర్తమానం కాలంలో ప్రతి రంగంలో పోటీ పెరుగుతుందన్నారు. రోబోటిక్స్‌తో పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రోబోల ఉపయోగం వ్యవసాయ రంగంలో, వైద్య చికిత్సల నిర్వహణకు విసృతంగా ఉపయోగం ఉంటుందన్నారు. మనుషులు చేయలేని పని క్లిష్టమైన పనులను కూడా రోబోలు సమర్థవంతంగా చేసే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ రోబోటిక్ వ్యవస్థ భవిష్యత్తులో చక్కటి ఉపయోగం ఉంటుందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్ధులు చేసిన ఆవిష్కరణలు ప్రశంసనీయంగా ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సురేంద్ర నార్కడే, ప్రభుత్వ డిగ్రీకళాశాల ఉప ప్రధానాచార్యులు లక్ష్మీ నారాయణ, అధ్యాపకులు జనార్ధన్, జవహార్ నవోదయ ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ, ఈఎంఆర్‌ఎస్ ప్రిన్సిపాల్ కనికవర్మ తదితరులు పాల్గొన్నారు. కాగా జవహార్ నవోదయ విద్యాలయంలో మంగళవారం విద్యార్ధులు రోబోటిక్స్‌తో చక్కటి ప్రదర్శనలు చేశారు. భవిష్యత్తులో ఉపయోగపడే అంశాలను దృష్టిలో పెట్టుకొని వివిధ రోబోలను తయారు చేశారు. అస్మిత్, సంజూ అనే విద్యార్ధులు డైవర్ రహిత కారును ఆవిష్కరించారు. కేవలం చిన్నపాటి టార్చిలైట్ వెలుగు కారుపై పడగానే తనంతట తానే స్టాట్ అవుతుంది. వైర్‌లైస్ సిస్టం ద్వారా అనుసంధానం చేసుకుంటు ఎంత దూరమైన పోయేట్టు ఆవిష్కరించారు. అలాగే మనిష్, వర్మ చేసిన ప్రయోగం ఎంతగానో ఆకట్టుకుంది. చిన్నపాటి చిటికె శబ్ధం వేస్తే లైట్లు, వీధి దీపాలు, ఫ్యాన్లు ప్రారంభమయ్యేట్టు చేశారు. వీటితో పాటు వర్షం పడితే ధాన్యం తడువకుండా ముందస్తుగానే మోగే అలారం వ్యవస్థ, రోడ్డు సిగ్నల్ నిబంధనలను కంట్రోలు చేసే విధానం, మోటార్ పంపులు ఆన్‌ఆఫ్ చేసే విధానం ఆకట్టుకుంది.