Share News

kumaram bheem asifabad- వాడవాడలా ఎగిరిన జెండా

ABN , Publish Date - Aug 15 , 2025 | 11:23 PM

జిల్లా వ్యాప్తంగా ఆయా మండాల్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్‌ జిల్లా పరిషత్‌ కార్యాల యంలో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జిల్లా గ్రంధాలయంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, కోర్టు అవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్‌, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌, జిల్లా అటవిశాఖ కార్యాలయంలో డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌, మెడికల్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్‌ కార్యాలయంలో ఈఈ కృష్ణ, నీటిపారుదల కార్యాలయంలో ఈఈ గుణవంత్‌రావు, జెండా ఎగురవేశారు.

kumaram bheem asifabad- వాడవాడలా ఎగిరిన జెండా
114ఏఎస్‌ఎఫ్‌15: 116ఏఎస్‌ఎఫ్‌పి15:జడ్పీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఆయా మండాల్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్‌ జిల్లా పరిషత్‌ కార్యాల యంలో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జిల్లా గ్రంధాలయంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, కోర్టు అవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్‌, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌, జిల్లా అటవిశాఖ కార్యాలయంలో డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌, మెడికల్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్‌ కార్యాలయంలో ఈఈ కృష్ణ, నీటిపారుదల కార్యాలయంలో ఈఈ గుణవంత్‌రావు, జెండా ఎగురవేశారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అద్యక్షుడు ధోని శ్రీశైలం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి, తహసిల్థార్‌ కార్యాలయంలో ఎమ్మార్వో రీయాజ్‌ ఆలీ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్‌, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ గజానంద్‌ జెండా అవిష్కరించారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి) కాగజ్‌నగర్‌ పట్టణంలోని గాంధీచౌక్‌, ఎమ్మెల్యే నివాసంలో సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు, అన్నదాన సత్రం వద్ద సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సర్‌సిల్క్‌ కాలనీలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌తో పాటు ఆయా పార్టీల నాయకులు వివిధ కూడళ్లలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అన్నీ ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలలు, పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక శిశుమందిర్‌ హైస్కూల్‌ మందిర్‌ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌, (ఆంధ్రజ్యోతి):కాగజ్‌నగర్‌ పట్టణంలోని పలు పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఆదర్శనగర్‌ సరస్వతీ శిశుమందిర్‌ ఎస్పీఎం క్రీడా మైదానంలో డిఏవి లక్ష్మీపతి సింఘానియా పాఠశాల విద్యార్థులు, పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండలంలో జెండా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ సూర్యప్రకాష్‌, సీఐ సంజయ్‌, ఎస్సై చంద్రశేఖర్‌, ఎంపీడీవో శంకరమ్మ, డాక్టర్‌ సుజిత్‌ బీఆర్‌ఎస్‌మండల అధ్యక్షుడు రాంబాబు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఎల్‌ రమేశ్‌ తదిదరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా జెండాలను ఎగురవేశారు. విద్యార్థులు భారతమాత వేషధారణలో ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ కవిత, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఏవో గోపికాంత్‌, వైద్యాధికారి వినయ్‌, ఏపీఎం కోనయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ జాబిరే పెంటు, ఇన్‌చార్జీ ప్రిన్సిపాల్‌ చంద్రయ్య, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే నారాయణ తదితరులు పాల్గొన్నారు.

లింగాపూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలో వాడవాడలా జెండా వేడుకలు ఘనంగా నిర్వ హించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో రామచందర్‌, ఎస్సై గంగన్న, ఎంఈవో శ్రీనివా స్‌, కేజీబీవీ అధికారిణి భారతి తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలో వాడవాడలా జెండా ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ ప్రహ్లాద్‌, ఎంపీడీ వో కృష్ణారావు, ఎంఈవో కుడ్మేత సుధాకర్‌,ఎస్పై రామకృష్ణ, సహకార సంఘం చైర్మన్‌ కేంద్రే శివాజీ, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తోడసం ధర్మారావు, కాంగ్రెస్‌ నాయకుడు ఆత్రం దౌలత్‌రావు కేజీబీవీ ప్రత్యేక అధికారి స్వప్న, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు తదిరులు పాల్గొన్నారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండలంలో స్వాతంత్య్రత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దాద్‌ ప్రమోద్‌, సీఐ సంతోష్‌కుమార్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మాంతయ్య, ఎంపీవో మహేందర్‌రెడ్డి, ఎంఈవో హనుమంతు, ఏవో ప్రేమలత, డాక్టర్‌ శ్రీకాత్‌, ఏపీఎం వినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపలి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ దౌలత్‌, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఎఫ్‌ఆర్వో సుభాష్‌, ఎస్సై నరేష్‌, ఐకేపీ ఏపీఎం మోహన్‌లాల్‌, ఎంఈవో జయరాజు తదితరలు జెండాలను ఎగురవేశారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా జెండాలు ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ రామ్మోహన్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై సర్తాజ్‌పాషా, ఏవో నాగరాజు, అటవీశాఖ రేంజ్‌ అధికారి ముసావీర్‌, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ ఓంప్రకాష్‌, ఎంఈవో సునీత, కేజీబీవీ ఎస్‌వో అరుణ, వాసవి క్లబ్‌ అధ్యక్షుడు శ్రీవర్ధన్‌, రంగనాయక ఆలయ కమలిటీ అధ్యక్షుడు మహేష్‌ పాల్గొన్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యాలయాల్లో తహసీల్దార్‌ పుష్పలత, ఎంపీడీవో ఆల్బర్ట్‌, ఎఫ్‌ఆర్వో అనీల్‌కుమార్‌, ఎస్సై అనీల్‌కుమార్‌, ఏఈవో మనీషా, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండాను ఆవిష్కరించారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ భూమేశ్వర్‌, ఎంపీడీవో అంజద్‌పాషా, ఎస్సై మధుకర్‌, ఏవో యుగేందర్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ అస్మత్‌అలీ, ఐకేపీ ఏపీఎం ముక్తేశ్వర్‌, ఎంఈవో ప్రకాష్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు కుసుమ్‌రావు, బీఆర్‌ఎస్‌ నాయకుడు కలాం తదితరులు పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా జెండాలు ఎగురవేశారుర. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ మునావర్‌షరీఫ్‌, ప్రత్యేకాధికారి సజీవన్‌, ఎస్సై విక్రమ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుపతి గౌడ్‌, కేజీబీవీ ఎస్‌వో జ్యోతి, ఐకేపీ ఏపీఎం ప్రకాష్‌, డాక్టర్‌ అశ్విని, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కిషన్‌రావు, ఏఈవో వంశీ పాల్గొన్నారు.కాగా ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మండల ప్రత్యేకాధికారి సజీవన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో ముడి విప్పుకోలేదు. కార్యాలయ సిబ్బంది భవనం పైకి ఎక్కి సవరించిన అనంతరం జెండా ఎగురవేశారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): మండలంలో వాడవాడలా జెండా వేడుకలు ఘనంగా నిర్వ హించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ రహీముద్దీన్‌, గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి, ఎంపీడీవో సత్యనారాయణ, ఎస్సై కమలాకర్‌, సహకార సంఘం చైర్మన్‌ బాపు, ఏవో గిరీష్‌, ఎంఈవో వేణుగోపాల్‌రావు పాల్గొని జెండా ఎగురవేశారు.

Updated Date - Aug 15 , 2025 | 11:23 PM