Share News

kumaram bheem asifabad-జీవో 49 శాశ్వత రద్దుకు పోరాటం

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:08 PM

జీవో 49 శాశ్వత రద్దుకు పోరాటం చేస్తామని బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జీవో49ను పూర్తిగా రద్దు చేయాలని ఐదు రోజులుగా ఎమ్మెల్యే హరీష్‌బాబు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను బీజేపీ శాసన సభ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.వెంకటరమణ రెడ్డి(కామారెడ్డి), రాకేష్‌రెడ్డి(ఆర్మూర్‌), పాయల శంకర్‌(ఆదిలాబాద్‌) శుక్రవారం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు

kumaram bheem asifabad-జీవో 49 శాశ్వత రద్దుకు పోరాటం
దీక్షను విరమింప జేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు

కాగజ్‌నగర్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): జీవో 49 శాశ్వత రద్దుకు పోరాటం చేస్తామని బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జీవో49ను పూర్తిగా రద్దు చేయాలని ఐదు రోజులుగా ఎమ్మెల్యే హరీష్‌బాబు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను బీజేపీ శాసన సభ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.వెంకటరమణ రెడ్డి(కామారెడ్డి), రాకేష్‌రెడ్డి(ఆర్మూర్‌), పాయల శంకర్‌(ఆదిలాబాద్‌) శుక్రవారం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆరోగ్యం క్షీణిస్తుండడంతో పార్టీ అధిష్ఠానంతో మాట్లాడామని అన్నారు. ఇక్కడి కార్యకర్తల అభీష్టం మేరకు దీక్షను విరమింపజేశామని తెలిపారు. ఎమ్మెల్యే పాయుల శంకర్‌ మాట్లాడుతూ జీవో 49 రద్దు, పోడు సమస్యపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఎమ్మెల్యే వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందని విమర్శించారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, ప్రధాన కార్యదర్శులు అరిగెల మల్లికార్జున్‌, రాపర్తి ధనుంజయ్‌, ఆసిఫాబాద్‌ మాజీ జడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వర్‌ రావు, పట్టణ అధ్యక్షుడు ఆర్మీశివ, మాజీ కౌన్సిలర్లు ఈర్ల విశ్వేశ్వర్‌ రావు, సిందం శ్రీనివాస్‌, బాల్కశ్యాం, ఆశోక్‌ ఆర్యతో పాటు నియోజకవర్గంలోని అన్నీ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బంద్‌ ప్రశాంతం..

ఎమ్మెల్యే చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా బీజేపీ నాయకులిచ్చిన పిలుపు మేరకు కాగజ్‌నగర్‌లో శుక్రవారం బంద్‌ ప్రశాతంగా ముగిసింది. ఈ సందర్భంగా పలు దుకాణాలు స్వచ్చందంగా మూసి వేశారు. అలాగే ప్రయివేటు పాఠశాలలు కూడా బంద్‌ పాటించాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పట్టణణలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.అనంతరం మార్కెట్‌లో తెరిచి ఉన్న పలు దుకాణాలను బంద్‌ చేయించారు. ఈ విషయంలో ఇద్దరు వ్యాపారుల మధ్య చిన్న పాటి ఘర్షణ ఏర్పడింది. అక్కడే ఉన్న పోలీసులు సముదాయించి ఇరువర్గాలను పంపించేశారు. కాగా పోడు సమస్యను పరిష్కరించక పోవడం జీవో 49ని పూర్తిగా రద్దు చేయక పోవటాన్ని నిరసిస్తూ కాగజ్‌నగర్‌లో బీజేపీ నాయకులు ఎమ్మెల్యే నివాసం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

Updated Date - Aug 22 , 2025 | 11:08 PM