Share News

రైతన్నే దేశానికి వెన్నెముక

ABN , Publish Date - Dec 26 , 2025 | 10:00 PM

అన్నం పెట్టే రైతన్నే దేశానికి వెన్నెముక అని, కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజమైన రైతు పక్షపాతి అని రాష్ట్ర గిరిజన ఆర్థికభివృద్ధి కోఆపరేటివ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ కోట్నాక తిరుపతి అన్నారు.

 రైతన్నే దేశానికి వెన్నెముక
సమావేశంలో మాట్లాడుతూన్న కట్నాక తిరుపతి

రాష్ట్ర గిరిజన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోట్నాక తిరుపతి

దండేపల్లి డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అన్నం పెట్టే రైతన్నే దేశానికి వెన్నెముక అని, కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజమైన రైతు పక్షపాతి అని రాష్ట్ర గిరిజన ఆర్థికభివృద్ధి కోఆపరేటివ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ కోట్నాక తిరుపతి అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ గోదావరి బ్యాక్‌ వాటర్‌ సాగుకు విని యెగించుకోవడానికి గాను మండలంలోని గూడెం, ద్వారక, గుడిరేవు గ్రా మాలకు మినీ లిఫ్ట్‌ ప్రభుత్వం మంజూరు చేయడం పట్ల శుక్రవారం మం డలంలోని మ్యాదరిపేట బస్టాండ్‌ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే కోక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు భారీ కటౌట్‌లకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు, నా యకులు క్షీరాభిషేకం చేశారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడు తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు, ప్రజా సంక్షేమం కోసం ఆహర్నిషలు కృషి చేస్తుందని, రైతు కళ్లుల్లో ఆనందం చూడటమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమ న్నారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ వంతంగా అన్నిరం గాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నియోజకవర్గ అభి వృద్ధికి నిత్యం పాటు పడుతూ బారీగా నిధులు మంజూరు చేయిస్తున్నాడ న్నారు. గూడెం ఎత్తిపోతల పథకంతో పాటు ఈ మినీ లిప్ట్‌లు ఒక బృహ త్తర పథకమని, ఆయకట్టు రైతులకు ఈ ఎత్తిపోతల మినీ పథకం ఓ వ రంలాంటిదన్నారు. రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ జిల్లా అధ్యక్షు డు గడ్డం త్రిమూర్తి, లక్షెట్టిపేట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ దాసరి ప్రే మ్‌ చందు, పార్టీ మండల అధ్యక్షకార్యదర్శులు వెంకటేశ్వర్లు, సతీష్‌, మాజీ ఎంపీపీలు గురువయ్య, కాంతరావు, సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 10:00 PM