Share News

సీపీఎస్‌ అంతమే పీఆర్‌టీయూ పంతం

ABN , Publish Date - Aug 17 , 2025 | 11:33 PM

సీపీఏస్‌ అంతమే లక్ష్యంగా పీ ఆర్‌టీయూ సంఘం పని చేస్తుందని సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పేర్కొన్నా రు.

సీపీఎస్‌ అంతమే పీఆర్‌టీయూ పంతం

వనపర్తి విద్యావిభాగం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : సీపీఏస్‌ అంతమే లక్ష్యంగా పీ ఆర్‌టీయూ సంఘం పని చేస్తుందని సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పేర్కొన్నా రు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఆశనిపాతంగా మారినటువంటి సీపీఎస్‌ను సమూలంగా రూ పుమాపడానికి తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘమైన పీఆర్‌టీయూ టీఎస్‌ పూనుకుందని అన్నారు. అందులో భాగంగానే సంఘం ఆధ్వర్యంలో ఈ సెప్టెంబరు 1న హైద రాబాదులోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా ను చేపట్టనున్నట్లు చెప్పారు. అందులో భాగం గా మహాధర్నా పోస్టర్‌ను ఆదివారం వనపర్తి జి ల్లా కేంద్రంలోని జిల్లా శాఖ కార్యాలయంలో ఆ విష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డారు. సీపీఎస్‌ను సంపూర్ణంగా అంతం చేసి వో పీఎస్‌ను తీసుకొచ్చే బాధ్యత పీఆర్‌టీయూ సం ఘం తీసుకుందని, ఈ మహాఽధర్నాకు ఉపాధ్యా యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారెడ్డి బౌద్దారెడ్డి, సూర చంద్రశేఖర్‌, సూగూరు వరప్రసాద్‌ రావు, మం డల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా, మండల బాధ్యులు, సీనియర్‌ కార్యకర్తలు పా ల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 11:33 PM