కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:26 PM
నిరుపేద ల సొంత ఇంటి నిర్మాణం కల కాంగ్రెస్‌తోనే సాధ్య మవుతుందని ఎమ్మెల్యే డా క్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి
బిజినేపల్లి, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : నిరుపేద ల సొంత ఇంటి నిర్మాణం కల కాంగ్రెస్‌తోనే సాధ్య మవుతుందని ఎమ్మెల్యే డా క్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని పా లెంలో బుధవారం ఇందిర మ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణా నికి భూమిపూజ చేసి మాట్లాడారు. మొదటి విడతలో పూర్తిగా ఇళ్లు లేని పేదవారిని గుర్తిం చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా చేపడుతున్నామని తెలిపారు. డీసీసీ ఉపాధ్యక్షు డు బంగారి పర్వతాలు, కాంగ్రెస్ మండల అధ్య క్షుడు మిద్దె రాములు, నాయకులు గోవిందు రామకృష్ణ, అవంతి శంకర్, అమృత్‌రెడ్డి, దారెడ్డి హనుమంత్‌రెడ్డి, జయకృష్ణ, చికొండ్ర రాములు, గోవా శేఖర్, సొప్పరి పరశురాములు, వాల్యానా యక్, గోవిందునాయక్, కత్తె ఈశ్వర్, పండ్ల పాషా, రామన్‌గౌడ్, బాలపీరు, వెంకటేష్ గౌడ్, అధికారులు ఉన్నారు.
లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ అందజేత
నాగర్‌కర్నూల్ టౌన్ : జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బిజినేపల్లి మండ లానికి చెందిన 44 మంది లబ్ధిదారులకు ఎమ్మె ల్యే రాజేష్‌రెడ్డి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ఆత్మ హత్య చేసుకున్న ఏడుగురు రైతుల కుటుంబా లకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున ప్రభు త్వం ఆర్ధిక సహాయం అందించారు. కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్, కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.