Share News

kumaram bheem asifabad-జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:17 PM

వర్షకాలంలో ప్రజల సంక్షేమం కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, గడ్డం వివేకానంద, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, ప్రదాన కార్యదర్శి రామకృష్ణరావు, ఇతర ఉన్నతాదికారులతో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసుశాఖ, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad-జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): వర్షకాలంలో ప్రజల సంక్షేమం కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, గడ్డం వివేకానంద, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, ప్రదాన కార్యదర్శి రామకృష్ణరావు, ఇతర ఉన్నతాదికారులతో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసుశాఖ, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. వర్షకాలం సీజన్‌లో అదికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులలో నీటి నిలువల స్థాయి వినియోగం వానకాలం సీజన్‌లో వ్యవసాయసాగు, యూరియా నిల్వలు ఎరువుల కొరత లేకుండా సమకూర్చాలని సూచించారు. బారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జనజీవనం ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా వర్షాల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ అదికారులు ముందస్తూ చర్యల్లో బాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అకస్మిక తనిఖీలు నిర్వహించాలని అన్నారు. విధులను అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో మండల కేంద్రాలలో అదికారికంగా రేషన్‌కార్డులను పంపిణీ చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్ల, ఏఎస్పీ చిత్తరంజన్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 11:17 PM