Share News

మహిళలతోనే సమాజం అభివృద్ధి

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:35 PM

మహిళల అభివృద్ధితోనే సమా జం కూడా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. లక్షె ట్టిపేట పట్టణంలోని ఎంపీడీవో మీటింగ్‌ హాలులో మంగళవారం మహి ళలకు ప్రభుత్వం అందించే వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

మహిళలతోనే సమాజం అభివృద్ధి

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

లక్షెట్టిపేట, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మహిళల అభివృద్ధితోనే సమా జం కూడా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. లక్షె ట్టిపేట పట్టణంలోని ఎంపీడీవో మీటింగ్‌ హాలులో మంగళవారం మహి ళలకు ప్రభుత్వం అందించే వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ ప్రభుత్వం మహిళల అభివృద్ధే లక్ష్యంగా పలు పథకాలను కూడా ప్రవేశపెడుతోందన్నారు. అందులో భాగంగా మహిళల ఆర్థిక అభివృద్ధి కో సం ఈవడ్డీ లేని రుణాలను అందజేస్తుందన్నారు. ఇప్పుడు మంచిర్యాల ని యోజకవర్గంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు కోటి 43లక్షలకు పైచిలుకు రుణాలకు కేటాయించిందన్నారు. మహిళలు రుణాలతో ఆర్థికంగా లబ్దిపొందాలని సూచించారు. అనంతరం లబ్దిదారులకు మంజూరు అయిన చెక్కులను డీఆర్‌డీవో కిషన్‌తో కలిసి పంపిణీ చేసారు. ఈకార్యక్రమంలో మత్య్సశాఖ అధికారి అవినాష్‌తో పాటు మూడు మండలాల తహాసీల్దార్‌లు, ఎంపీడీవోలు, ఐకేపి ఏపీఎంలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 11:35 PM