Share News

వర్షం మిగిల్చిన నష్టం...

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:15 PM

జిల్లాలో బు ధవారం కురిసిన భారీ వర్షాలు రైతులకు తీరని నష్టం మిగిల్చాయి. అల్పపీడన ప్రభావం, నైరుతి రుతు పవ నాల కారణంగా గత రెండు రోజులుగా వర్షాలు కురు స్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా పె ద్ద మొత్తంలో పంటలకు నష్టం వాటిల్లింది.

 వర్షం మిగిల్చిన నష్టం...

-జిల్లాలో మూడు వేల ఎకరాల్లో పంట నీళ్లపాలు

-నాట్ల దశలో వరి, పెరుగుదల దశలో పత్తికి నష్టం

-పూర్వపు పంట నష్టం చేతికందక రైతుల అవస్థలు

-జిల్లాలో రూ. 3.5 కోట్ల పరిహారం పెండింగ్‌

మంచిర్యాల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బు ధవారం కురిసిన భారీ వర్షాలు రైతులకు తీరని నష్టం మిగిల్చాయి. అల్పపీడన ప్రభావం, నైరుతి రుతు పవ నాల కారణంగా గత రెండు రోజులుగా వర్షాలు కురు స్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా పె ద్ద మొత్తంలో పంటలకు నష్టం వాటిల్లింది. వర్షాల కా రణంగా నాట్ల దశలో ఉన్న వరి వరదల్లో కొట్టుకు పో గా, ఏపుగా పెరుగుతున్న పత్తిపంట పూర్తిగా నీట ము నిగింది. ఈ సంవత్సరం వర్షాకాలం సీజన్‌ ప్రారంభ మైన నాటి నుంచి మూడు దఫాలుగా వర్షాల కారణం గా పంటలు నీట మునగగా, రైతులకు అపార నష్టం వాటిల్లింది.

జిల్లాలో 3436 ఎకరాల పంట నీటిపాలు...

ఈ నెల 12న కురిసిన భారీ వర్షం కారణంగా జిల్లా లో 2138 మంది రైతులకు చెందిన 3436 ఎకరాల్లో పం టలు నీటిపాలయ్యాయి. వరి పంటకు సంబంధించి జి ల్లాలోని కన్నెపల్లి, భీమిని, నెన్నెల, వేమనపల్లి, తాం డూరు మండలాల్లో 917 మంది రైతులకు చెందిన 1434 ఎకరాలు నీట మునగగా, ఆవే మండలాల్లో 1221 మంది రైతులకు చెందిన 2002 ఎకరాల పత్తి చేలలో నీరు నిలిచింది. ఈ కారణంగా నాట్ల దశలోనే వరి పం టకు తీరని నష్టం వాటిల్లగా, పత్తి చెట్లు నీటిలో ము నగడం వల్ల ఎండిపోయే అవకాశాలు ఉన్నాయి. వర్షాల కారణంగా వరికి ఎకరాకు రూ. 10వేల చొప్పున రూ. కోటి 50 లక్షల మేర నష్టం వాటిల్లగా, పత్తి పంటకు ఎకరాకు రూ. 15వేల చొప్పున మొత్తం మూడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా.

నాలుగు దఫాల్లో పంటలు వర్షార్పణం...

ఈ యేడు మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన అకా ల వర్షాల కారణంగా వివిధ రకాల చేతికి వచ్చిన పంట లు నీటి పాలయ్యాయి. మూడు నెలల్లో ఏకంగా 2310 మందికి చెదిన 3505 ఎకరాల పంట నీట మునిగింది. మార్చి 21న కురిసిన వర్షం కారణంగా 162 మందికి చెందిన 120.17 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లగా, ఏప్రిల్‌ 13,14 తేదీల్లో భారీ వర్షాలకు 250 మంది రైతులకు చెందిన 199.23 ఎకరాలు, అలాగే ఏప్రిల్‌ 31 నుంచి మే 6వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఆ వ ర్షాలకు జిల్లా వ్యాప్తంగా 1898 మంది రైతులకు చెందిన 3186.13 ఎకరాల పంట పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది. వరి పంటకు సంబంధించి నెన్నెల, భీమారం మండలాల్లో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఆయా మండలాల్లో 490 రైతులకు సంబంధించిన 862 ఎ కరాల్లో పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మొ త్తంగా 2 లక్షల పై చిలుకు మెట్రిక్‌ టన్నుల ధాన్యం నీటిపాలైనట్లు అంచనా. అలాగే మామిడి పంటకు సం బంఽధించి నెన్నెల, జైపూర్‌, భీమారం, బెల్లంపల్లి, తాం డూరు, మందమర్రి మండలాల్లో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ఆయా మండలాల్లోని 1814 మంది రైతుల కు సంబంధించిన 3713 ఎకరాల్లో మామిడి పంట నేలరాలింది. తాజాగా ఈ నెల 12న కురిసిన భారీ వ ర్షాలకు సైతం పెద్ద మొత్తంలో రైతులకు పంట రూపంలో నష్టం వాటిల్లింది.

పంట నష్టం చెల్లించేదెప్పుడు...?

అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10వేల పరిహారం అందిస్తా మని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే మార్చి నుంచి మొదలుకొని మే నెల వరకు కురిసిన అకాల వర్షాల కారణంగా రైతులకు జరిగిన నష్టాన్ని వ్యవసా యశాఖ అధికారులు అంచనా వేసి, సంబంధిత రిపో ర్టును ప్రభుత్వానికి అందజేశారు. అయితే దాదాపు ఐ దు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బాధిత రైతులకు పరిహారం అందజేయలేదు. మార్చి నుంచి మే వరకు జరిగిన నష్టం అధికారుల అంచనా ప్రకారం రూ. 3 కోట్ల 50 లక్షల 63వేల 250

ఉంటుంది. ఆ మొత్తం రైతుల ఖాతాల్లో జమ కా వలసి ఉంది. అలాగే తాజాగా జరిగిన నష్టం విలువ దాదాపు రూ. నాలుగున్నర కోట్ల వరకు ఉంటుందని అంచనా. పాత బకాయిలతో కలిపి తాజాగా జరిగిన నష్టం పరిహారాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Aug 14 , 2025 | 11:15 PM