సందిగ్ధానికి తెర...
ABN , Publish Date - May 15 , 2025 | 10:52 PM
జిల్లా కేంధ్రంలో ప్రభుత్వపరంగా నిర్మించతలపెట్టిన 600 పడకల సూ పర్ స్పెషాలిటీ హాస్పిటల్, మాతా శిశు ఆరోగ్య కేంద్రా నికి అవసరమైన నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం జీవో జారీ చేసింది. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌర స్తా సమీపంలోని పాత ఆర్‌అండ్‌బీ అతిథి గృహ ఆవర ణలో గల 4.33 ఎకరాల స్థలాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఎంపిక చేసిన విషయం తెలిసిం దే.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు
-మొదటి విడుతలో రూ. 50 కోట్లు..
-రెండో విడుతలో రూ. 250 కోట్లు విడుదల
-పరిపాలనా అనుమతులు జారీ
-జిల్లాతోపాటు ఇతర జిల్లాలు, మహారాష్ట్ర ప్రజలకు మేలు
మంచిర్యాల, మే 15 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంధ్రంలో ప్రభుత్వపరంగా నిర్మించతలపెట్టిన 600 పడకల సూ పర్ స్పెషాలిటీ హాస్పిటల్, మాతా శిశు ఆరోగ్య కేంద్రా నికి అవసరమైన నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం జీవో జారీ చేసింది. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌర స్తా సమీపంలోని పాత ఆర్‌అండ్‌బీ అతిథి గృహ ఆవర ణలో గల 4.33 ఎకరాల స్థలాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఎంపిక చేసిన విషయం తెలిసిం దే. రూ. 324 కోట్ల అంచనా వ్యయంతో సూపర్ స్పె షాలిటీ ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మా ణం కోసం తెలంగాణ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ తొలి విడతగా రూ. 50 కోట్లకు ప రిపాలన అనుమతులు జారీ చేస్తూ సెప్టెంబరు 12న జీవో 546న విడుదల చేయగా, నవంబరు 21న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఐ టీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. మొదటి విడుతలో మంజూరైన రూ. 50 కోట్లతో భవనాల ని ర్మాణ పనులు ప్రారంభంకాగా తాజాగా రెండో విడు త నిధులు రూ. 250 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఈ నెల 13న జీవో 209 ద్వారా పరిపాలనా అనుమ తులు మంజూరు చేసింది. దీంతో ఇంతకాలం నెలకొ న్న సందిగ్ధానికి తెరపడింది. ఆసుపత్రి నిర్మాణానికి అ వసరమైన నిధులు దాదాపుగా పూర్తి స్థాయిలో విడుద ల కావడంతో పనులు ఊపందుకోనున్నాయి.
కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం...
జిల్లా కేంధ్రంలోని ఐబీ సమీపంలో నిర్మితం అవు తున్న ఆసుపత్రి భవన సముదాయంలో మొత్తం ఏడు అంతస్థులతో భవన నిర్మాణం చేపడుతుండగా, కార్పొ రేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు ప్రజలకు అందను న్నాయి. భవన నిర్మాణాన్ని గరిష్టంగా మూడు సంవత్స రాల కాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ప్రా రంభించగా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు తో మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలతో పా టు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రజల కు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన ప్రాంగణంలోనే మాతా, శి శు సంరక్షణ కేంధ్రం (ఎంసీహెచ్) భవనం నిర్మాణం జరుగుతుండగా, ఒకే ప్రాంగణంలో రెండు ఆసుపత్రు ల నిర్వహణ కొనసాగనుంది. ప్రస్తుతం ఎంసీహెచ్ జి ల్లా కేంద్రంలోని గోదావరి సమీపంలో ఉంది. దీంతో వర్షాకాలంలో ప్రతియేటా గోదావరి ఉప్పొంగి నప్పుడ ల్లా వరదలకు ఆసుపత్రి భవనం ముంపునకు గుర వుతోంది. దీంతో పగలు, రాత్రి తేడాలేకుండా అక్కడ చి కిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలతో పాటు చి న్నారులను హుటాహుటిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కి తరలించాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల అవస్థలు దృష్టిలో ఉంచుకున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ఎంసీహెచ్‌ను కూడా ఐబీ చౌరస్తా సమీపంలో నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలోకి మార్చాలనే ఉద్దే శ్యంతో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
అనువైన చోట భవన నిర్మాణం....
జిల్లా కేంద్రంలోని ఐబీ సమీపంలో ఆసుపత్రుల ని ర్మాణం కోసం కేటాయించిన స్థలం అన్ని విధాలా అను వైనదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ స్థలానికి ఎదురుగా ప్ర భుత్వ జనరల్ ఆసుపత్రి ఉండటంతో వైద్యం కోసం వ చ్చే ప్రజలకు అందుబాటులో ఉండనుంది. రెండు ఆస్ప త్రులకు నడుమ జాతీయ రహదారి ఉండటంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే నిత్యం బిజీగా ఉండే రోడ్డు దాట డానికి ఇబ్బందులు పడకుండా రోగులు చికిత్స పొందేం దుకు అవకాశం ఏర్పడుతుంది. పైగా సూపర్ స్పెషాలి టీ ఆసుపత్రికి వచ్చేందుకు రోగులకు బస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఐబీ చౌరస్తాలో బస్సు దిగగానే నేరుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితోపాటు, ఎదురుగా ఉన్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు వెళ్లడా నికి సౌకర్యవంతంగా ఉంటుంది. గోదావరి సమీపంలో ఉన్న ఎంసీహెచ్‌కు చేరడానికి ఇంతకాలం నానా అవస్థ లు పడ్డ రోగులు, వారి కుటుంబ సభ్యులు ఐబీ చౌర స్తాలో ఏర్పాటు చేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.