kumaram bheem asifabad- సమస్యల తిష్ఠ
ABN , Publish Date - Aug 26 , 2025 | 10:51 PM
తెలంగా ణ-నార్త్ ఇండియాను కలిపే ముఖ్యమైన కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో సమస్యలు పేరుకుపోయాయి. ఏడాది కాలంగా థర్డ్ లైన్ పనులు బెల్లంపల్లి-కాగజ్‌నగర్ మధ్య కొనసాగుతుండడంతో నెలల తరబడి ప్యాసింజర్ రైళ్లు తరుచూ రద్దు అవుతున్నాయి. దీంతో ఫ్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సమయంలో నిలిపివేసిన నాగ్‌పూర్ (అజ్ని)-ఖాజీపేట ప్యాసింజర్ రైలు ఇంత వరకూ తిరిగి ప్రారంభం కాలేదు.
- రోజు 50కిపైగా రైళ్ల రాకపోకలు
కాగజ్‌నగర్ టౌన్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగా ణ-నార్త్ ఇండియాను కలిపే ముఖ్యమైన కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో సమస్యలు పేరుకుపోయాయి. ఏడాది కాలంగా థర్డ్ లైన్ పనులు బెల్లంపల్లి-కాగజ్‌నగర్ మధ్య కొనసాగుతుండడంతో నెలల తరబడి ప్యాసింజర్ రైళ్లు తరుచూ రద్దు అవుతున్నాయి. దీంతో ఫ్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సమయంలో నిలిపివేసిన నాగ్‌పూర్ (అజ్ని)-ఖాజీపేట ప్యాసింజర్ రైలు ఇంత వరకూ తిరిగి ప్రారంభం కాలేదు. కాగజ్‌న గర్ నుంచి హైద్రాబాద్, వరంగల్, ఖాజీపేట వైపు వెళ్లేం దుకు తెల్లవారుజామున 3.30కు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. తర్వాత ఉదయం పూట నుంచి మధ్యాహ్నం వరకు రైల్లు లేవు. ఖాజీ పేట-అజ్ని ప్యాసింజర్ రైలు ఉదయం 5.30కు ఉండేది. దీంతో ప్రయాణికులకు వెసులుబాటుగా ఉండేది. దీనిని పునఃప్రారంభించాలని కోరుతున్నా మొదలు కాలేదు. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ తర్వాత సికింద్రాబాద్ వైపు రైలును నడిపించాల్సి ఉంది. అలాగే ప్లాట్ ఫాం 2,3లో నూతనం నిర్మించినప్పటికీ షెడ్లు పూర్తి స్థాయిలో లేక పోవడంతో వానాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలం వరకైనా పూర్తి స్థాయిలో షెడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. అలాగే ప్లాట్ ఫాంలో మరుగుదొడ్లు, తాగునీరు, లిఫ్ట్ సౌకర్యం, బుకింగ్ కౌంటర్ లేకపోవడంతో 1వ ప్లాట్‌ఫాం లోకి వెళ్లాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్లాట్ ఫాం 2,3లో ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు వేయాల్సి ఉంది. ఆయా సమస్యలపై రైల్వే యాత్రి సేవా సమితి కాగజ్‌నగర్ అధ్యక్షుడు ప్రయాగ్ తివారీ, పీఆర్‌వో పవన్ బల్ద్‌వా, తదితరులు పలుమార్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు దృష్టికి సమస్యలు తీసుకెళ్లారు. గత నెలలో వచ్చిన దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ సుచిత్రరెడ్డికి వినతిపత్రం అందజేశారు. దీంతో పాటు చర్లపల్లిలో రైల్వే శాఖ మంత్రికి కూడా వందే భారత్ రైలు కాగజ్‌నగర్ హాల్టింగ్ తదితర సమస్యలపై ఎమ్మెల్యేతో కలిసి విన్నవించారు. కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులతో పాటు ముఖ్యంగా కౌటాల, బెజ్జూరు, చింతలమానెపల్లి, సిర్పూర్(టి), పెంచికలపేట, దహెగాం మండలాలోని ఆయా గ్రా మాల నుంచి హైదరాబాద్, వరంగల్ వైపు ఆసుపత్రు లు, ఇతరత్ర పనులకు నిత్యం వందలాది మంది ప్రయాణం చేస్తుంటారు. కాగజ్‌నగర్‌కు వచ్చే పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా వస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రైళ్లు సమయ పాలన పాటించేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
వినతిపత్రాలు ఇస్తున్నా..
సికింద్రాబాద్ లేదా చర్లపల్లి, కాగజ్‌నగర్ మీదుగా హౌరా వెళ్లేందుకు రైలు కోసం వినతి పత్రాలు ఇస్తున్న పట్టించుకోవడం లేదు. కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, చెన్నై-జోద్‌పూర్, వందే భారత్ రైళ్లు హాల్టింగ్ కోసం కూడా పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఇంకా నోచుకోలేదు. నిత్యం కాగజ్‌నగర్ మీదుగా 50కి పైగా రైళ్లు ధిల్లీ, చెన్నై, సికింద్రాబాద్ వైపు వెళుతుంటాయి. రాష్ట్ర సరిహద్దులోని రైల్వే స్టేషన్‌తో పాటు జిల్లాలోని ఏకైక పెద్ద స్టేషన్‌లో సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
వినతిపత్రాలు అందించాం..
- ప్రయాగ్ తివారి, రైల్వే యాత్రి సేవా సమితి అధ్యక్షుడు
కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో సమస్యలు పరిష్కరించా లని గతంలో నుంచే వినతిపత్రాలు ఇస్తున్నాం. పలు సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఇంకా పలు రైళ్లు నిలుపుదల చేయాలి. ముఖ్యంగా వందే భారత్, కేరళ, తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగాల్సి ఉంది. ప్లాట్ ఫారంపై ఇంకా పలు సమస్యలు పరిష్కరించల్సి ఉంది. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఇటీవల రూ. 9 కోట్లు మంజూరు కావడం శుభ పరిణామం.