Share News

kumaram bheem asifabad- స్వతంత్రుల దారెటు..

ABN , Publish Date - Dec 25 , 2025 | 10:57 PM

గ్రామపం చాయతీ ఎన్నికలు హోరాహోరీగా ముగిశాయి. ఈ నెల 22న సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డుసభ్యులు ప్రమాణస్వీ కారం చేశారు. పార్టీల మద్దతుతో గెలిచిన వారు ఆయా పార్టీల ముఖ్య నేతలతో తమ సంబరాలు పంచుకుంటున్నారు. గ్రామంలో తమ పార్టీ జెండా ఎగురవేశామని సగర్వంగా చెప్పుకుంటున్నారు. ఏ పార్టీ మద్దతు లేకుండా వ్యక్తిగత ప్రతిష్టతో గెలిచిన స్వతంత్రులు మాత్రం తర్జనభర్జన పడుతున్నారు.

kumaram bheem asifabad- స్వతంత్రుల దారెటు..
లోగో

- కేంద్ర నిధులు వస్తాయని బీజేపీని ఆశ్రయించాలా?

- తేల్చుకోలేకపోతున్న కొత్త సర్పంచ్‌లు

బెజ్జూరు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): గ్రామపం చాయతీ ఎన్నికలు హోరాహోరీగా ముగిశాయి. ఈ నెల 22న సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డుసభ్యులు ప్రమాణస్వీ కారం చేశారు. పార్టీల మద్దతుతో గెలిచిన వారు ఆయా పార్టీల ముఖ్య నేతలతో తమ సంబరాలు పంచుకుంటున్నారు. గ్రామంలో తమ పార్టీ జెండా ఎగురవేశామని సగర్వంగా చెప్పుకుంటున్నారు. ఏ పార్టీ మద్దతు లేకుండా వ్యక్తిగత ప్రతిష్టతో గెలిచిన స్వతంత్రులు మాత్రం తర్జనభర్జన పడుతున్నారు. పార్టీల్లో చేరాలనే ఆహ్వానాలు అందుతుండడమే ఇందుకు కారణం, కానీ ఏ పార్టీలో చేరాలనేదీ తేల్చుకోలేకపోతున్నా రు. గ్రామంలో అభివృద్ధి జరగాలన్నా, ముఖ్య నేతల అండ దండలు ఉండాలన్నా పార్టీ కండువా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఎటువైపు మొగ్గుచూప ుతారో వేచిచూడాలి. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 335గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 332పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. రిజర్వేషన్లు అనుకూలించని మరో మూడు పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. ఇందులో 10మంది సర్పంచ్‌ల ఏకగ్రీవాలను మినహాయిస్తే 322పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీ చేసిన వారు మెజారిటీ స్థానాల్లో గెలుపొందగా, ఆ తర్వాత గట్టి పోటీనిచ్చి కాంగ్రెస్‌ నిలిచింది. ఇక బీజేపీ అభ్యర్థులు చాలాచోట్ల చతికిలపడ్డారు.

- 58 మంది విజయం..

జిల్లాలో 58మంది సర్పంచ్‌లు స్వతంత్రంగా బకిలోకి దిగి విజయం సాధించారు. వీరిలో చాలా మంది ఎలాంటి రాజకీయ నేపథ్యం కూడా లేదు. కొంతమందికి రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ పార్టీల మద్దతు లభించక స్వతంత్రంగా పోటీ చేసి గెలిచారు. సొంత పార్టీ నేతల నుంచి తగిన సహకారం లేకపోవడంతో తమ బలాన్ని నమ్ముకొని బయటపడ్డారు. కష్టాల్లో చేరదీయని సొంత పార్టీల కంటే పరాయి పార్టీలే ముఖ్యమని కొందరు స్వతంత్ర సర్పంచ్‌లు బహిరంగంగా చెబుతున్నారు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో చేరితే అభివృద్ధి జరుగుతుందని, పనులు చేసుకోవచ్చని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇటు కాంగ్రెస్‌, అటు బీఆర్‌ఎస్‌లో చేరడం కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కండువా కప్పుకుంటే ఎంపీ నిధులు, ఇతర నిధులు వస్తాయని భావిస్తున్నారు. అందుకే తమ గెలుపునకు దోహదపడిన వారితో చర్చలు జరుపుతున్నారు.

- ఆయా పార్టీల నేతల నుంచి..

ఆయా పార్టీలకు చెందిన నేతల నుంచి స్వతంత్ర సర్పంచ్‌లకు ఇబ్బడిముబ్బడిగా ఆహ్వానాలు అందుతూనే ఉన్నాయి. గెలిచిన వారికి సమీపంగా ఉన్న ఉన్నవారితో సమాచారం చేరవేస్తూ ఉన్నారు. గ్రామపంచాయతీల్లో తమ బలం, బలగాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు ప్రయత్నాలు ఆరంభించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమదైన శైలిలో కబురు పంపిస్తున్నారు. మూడేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుం దని, ఆ తర్వాత కూడా తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ నేతలు ఆకర్షిస్తున్నా రు. ఇక మూడేళ్లలో రెండేళ్లే అధికారం చెలాయిస్తారని, ఆ తర్వాత ఎన్ని కలు వస్తా యని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కడతారని అనవసరంగా కాంగ్రెస్‌లో చేరవద్దని గులాబీ శ్రేణులు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఇక గ్రామాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు పదుల సంఖ్యలో లీడర్లు ఉన్నారని, బీజేపీలో చేరితే పార్టీకి, గ్రామానికి పెద్దది క్కుగా ఉంటావని, కేంద్ర నిధులు, ఎంపీ నిధుల్లో అగ్రతాంబూలం కల్పిస్తామని బీజేపీ నాయకులు ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు.

Updated Date - Dec 25 , 2025 | 10:57 PM