దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యం
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:33 PM
దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమని, పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమైన తర్వాత మొ దటిసారిగా మంచిర్యాలకు వచ్చిన వెరబెల్లి రఘునాథ్ అభినందన సభలో ఎంపీ పాల్గొన్నారు.
వెరబెల్లి రఘునాధ్‌కు స్వాగతం పలుకుతున్న బీజేపీ నాయకులు
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమని, పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమైన తర్వాత మొ దటిసారిగా మంచిర్యాలకు వచ్చిన వెరబెల్లి రఘునాథ్ అభినందన సభలో ఎంపీ పాల్గొన్నారు. కార్యకర్తల బైక్ ర్యాలీతో బీజేపీ శ్రేణులు రఘునాథ్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఐబీ చౌరస్తాలోని హ ను మాన్ విగ్రహం వద్ద ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఆదిలాబాద్ ఎమ్మె ల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌నేతతో కలిసి హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంబే ద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ, ఎ మ్మెల్యేలకు బీజేపీ నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికా రు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ నేతృత్వంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాలేజీ రోడ్డులోని పద్మనాయక పంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన అభినందన సభలో వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగ రడం ఖాయమన్నారు. దేశ రక్షణకు బీజేపీ రక్షణ కవచంలా ఉం టుందన్నారు. ప్రజాభీష్టం మేరకే బీజేపీ పరిపాలన ఉంటుందని, అవినీతి, అక్రమాలు ఉండవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూ రిత హామీలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా చేసింది శూన్యమన్నారు. అనంతరం రఘునాథ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆది లాబాద్ జిల్లా బీజేపీ కంచుకోటగా చెప్పుకోవచ్చన్నారు. కార్యకర్తల కృషి వల్లనే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. తా ను చేసిన పోరాటం ద్వారా మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో వందేభారత్ రైలు ఆగేలా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోనె శ్యాంసుందర్‌రావు, కొయ్యల ఏమాజీ, శ్రీశైలం, పె ద్దపల్లి పురుషోత్తం, మున్నారాజాసిసోడియా, గాజులముకేష్‌గౌడ్, జో గుల శ్రీదేవి, సత్తయ్య, కమలాకర్‌రావు, కోడి రమేష్, వెంకటకృష్ణ, రమేష్, వెంకటేశ్వర్‌రావు, అశోక్, కృష్ణమూర్తి, తిరుపతి, శ్రీధర్, సం తోష్, జయశ్రీ, సురేఖ పాల్గొన్నారు.