Share News

పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:20 PM

జిల్లా లో నవంబర్‌ 1 నుంచి పత్తి కొనుగోలు చేపట్టనున్నందున కొను గోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో అధికారు లు, జిన్నింగు మిల్లుల నిర్వాహకులతో సమావేశం నిర్వ హించా రు.

పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లా లో నవంబర్‌ 1 నుంచి పత్తి కొనుగోలు చేపట్టనున్నందున కొను గోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో అధికారు లు, జిన్నింగు మిల్లుల నిర్వాహకులతో సమావేశం నిర్వ హించా రు. కలెక్టర్‌ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి కనీస మద్దతు ధర చెల్లించి పత్తి కొనుగోలు చేస్తామన్నారు. రైతులు దళారులకు పత్తిని విక్రయించి మోసపో కుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి కనీస మద్దతు ధరతో లబ్ది పొందాలని తెలిపారు. సీసీఐకి పత్తి విక్రయించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కపాస్‌ కిసాన్‌యాప్‌లో రైతులు తమ వివరాలను నమోదు చేసుకుని పత్తి విక్రయానికి స్లాట్‌బుక్‌ చే సుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పత్తిలో తేమ 12 శాతం కంటే తక్కువగా ఉండాలన్నారు. నాణ్య త లేని, రంగు మారిన పత్తిని కొనుగోలు చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పత్తి జిల్లాలోకి రాకుండా సరిహద్దుల వద్ద చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని అధికారు లకు సూచించారు. ఆధార్‌ నెంబర్‌కు అనుసంధానం చేయబడిన బ్యాంకు ఖాతాలో మాత్రమే చెల్లింపులు జరుగుతాయన్నారు. రై తులు దళారులను నమ్మి మోసపోవద్దని, సీసీఐ కేంద్రాల్లో విక్ర యించి మద్దతు ధర పొందాలన్నారు. రెవెన్యూ అధికారి, మం డల వ్యవసాయ అధికారి, పోలీసు అధికారులతో కూడిన కమి టీని ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియపై పర్యవేక్షిస్తామన్నారు.

-సీఎంఆర్‌ లక్ష్యాలను పూర్తి చేయాలి

2024-25 సంవత్సరం ఖరీఫ్‌, రబీలకు సంబంధించి జిల్లాలోని రైసుమిల్లులకు కేటాయించిన సీఎంఆర్‌ డెలివరీ లక్ష్యాలను త్వర గా పూర్తిచేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. బుధవా రం కలెక్టర్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం ని ర్వహించారు. కేటాయించిన లక్ష్యాలను పూర్తిచేసుకుని 2025-26 సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌ వరిధాన్యం కోసం బ్యాంకు గ్యారంటీలు ఒప్పందాలు సమర్పించాలన్నారు. లక్ష్యాలను పూర్తి చేయని డి ఫాల్టర్‌ రైసుమిల్లులకు ధాన్యం కేటాయించడం జరగదని తెలి పారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, జిల్లా పౌరస రఫరాల అధికారి బ్రహ్మారావు, మేనేజర్‌ శ్రీకళ పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 11:20 PM