Share News

మళ్లీ వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:00 PM

రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

మళ్లీ వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే
దవాఖానాను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

- ఎమ్మెల్యే కూచకుళ్ల

తెలకపల్లి, సెప్టెంబరు10 (ఆంధ్రజ్యో తి) : రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండ ల పరిధిలోని కారువంగలో పల్లె దవా ఖానాను ప్రారంభించారు. అనంతరం సీసీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ చే శారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథ కాలు అందని ఇల్లు లేదంటే అతిశ యోక్తి కాదని అన్నారు. ఎన్నికల హామీలలో ఇవ్వని, చెప్పని పథకాలను కూడా అమలు చేసి సన్నబియ్యం ప్రజలందరికీ అందే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సింగి ల్‌విండో వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.యాదయ్య, మార్కెట్‌యార్డు వైస్‌ చైర్మన్‌ జంగయ్య, మాజీ ఎంపీపీలు పర్వతాలు, కొమ్ము మధు, నాయకు లు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 11:00 PM