Share News

కమిషనరేట్‌కు జాతీయ స్థాయిలో పేరు తేవాలి

ABN , Publish Date - Jul 03 , 2025 | 11:54 PM

రాష్ట్ర, జాతీయస్థాయిలో రామ గుండం కమిషనరేట్‌కు కాళేశ్వరం జోన్‌కు మంచి పేరు తీసుకురావాలని రా మగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా అన్నారు.

కమిషనరేట్‌కు జాతీయ స్థాయిలో పేరు తేవాలి

సీపీ అంబర్‌ కిషోర్‌ఝా

మంచిర్యాలక్రైం, జూలై3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర, జాతీయస్థాయిలో రామ గుండం కమిషనరేట్‌కు కాళేశ్వరం జోన్‌కు మంచి పేరు తీసుకురావాలని రా మగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా అన్నారు. పోలీసు కమి షనరేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో కాళేశ్వరం జోన్‌ స్థాయి పోలీసు డ్యూటీ మీట్‌ 2వ రోజు పలు అంశాలపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆ ర్మ్‌డ్‌ రిజర్వు విభాగాలైన డాగ్‌స్వ్కాడ్‌, బాంబ్‌ డిస్పోజల్‌ టీం పని తీరును ఆయన పరిశీలించారు. జాగిలాలు నేర స్థలంలో బాంబులను, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను ఏ విధంగా గుర్తిస్తాయని, డాగ్‌హ్యాండ్లర్‌ ప్రత్యే క్షంగా చూపించారు. అనుమానాస్పదమైన, ప్రమాదకరమైన ఇనుప వస్తు వులను ఏ విధంగా నివృత్తి చేయాలనే దానిపై సిబ్బందికి చూపించారు. ప్ర తిభ, సామర్థ్యం ఆధారంగా రాష్ట్రస్థాయిలో వరంగల్‌ పోలీసు కమిషన రేట్‌ లో నిర్వహించబడే తెలంగాణ రాష్ట్ర 2వ పోలీసు డ్యూటీ మీట్‌లో ఎంపిక చేశారు. ఎంపికైన కాళేశ్వరం జోన్‌ తరుపున, రాష్ట్ర తరుపున ప్రాతినిథ్యం వహించి కమిషనరేట్‌కు మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో అ డిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ రాజు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేశ్‌, ట్రాఫిక్‌ ఏసీ పీ శ్రీనివాస్‌, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 11:54 PM