Share News

కేంద్రం కగార్‌ ఆపరేషన్‌ను విరమించుకోవాలి

ABN , Publish Date - Jun 04 , 2025 | 11:10 PM

కేంద్ర ప్ర భుత్వం వెంటనే ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపి వేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరుపాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళ వారం కగార్‌ ఆపరేషన్‌ నిలిపివేయాలని అఖిలపక్షం నాయకులు కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు నరేశ్‌, సీపీఐ ఎంఎల్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు గాదె సత్యం, సీపీఐ కార్యదర్శి లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు.

కేంద్రం కగార్‌ ఆపరేషన్‌ను విరమించుకోవాలి
కగార్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న అఖిలపక్షం నాయకులు

అఖిలపక్ష నాయకుల డిమాండ్‌

మంచిర్యాలక్రైం, జూన్‌4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్ర భుత్వం వెంటనే ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపి వేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరుపాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళ వారం కగార్‌ ఆపరేషన్‌ నిలిపివేయాలని అఖిలపక్షం నాయకులు కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు నరేశ్‌, సీపీఐ ఎంఎల్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు గాదె సత్యం, సీపీఐ కార్యదర్శి లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. ఈసందర్భంగా నాయ కులు మాట్లాడుతూ అటవీ సంపదను కార్పొరేట్‌ శక్తు లకు కట్టబెట్టడానికి కగార్‌ ఆపరేషన్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం బూటక ఎన్‌కౌంటర్‌కు పాల్పడుతు న్నార ని విమర్శించారు. 2026 సంవత్సరం నాటికి మావో యిస్టూ పార్టీని పూర్తిగా లేకుండా చేయాలనే ల క్ష్యం తో మోదీ ప్రభుత్వం నరమేధానికి పాల్పడుతోం ద న్నారు. ఈ బూటకు ఎన్‌కౌంటర్‌లో అనేక మంది మావోయిస్టులు మృతి చెందారని ఇప్పటికే సుమారు 500 మంది మావోయిస్టులు మృతి చెందారని, మావో యిస్టులతో పాటు అమాయక ఆదివాసీలను కూడ బలిగొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ఫాసిస్టు విధానాన్ని అమలు చేస్తుం దన్నారు. అదాని, అంబాని ధన దాహం కోసం బీజేపీ సర్కార్‌ ప్రజలను, ప్రజా నాయకులను చంపడం ఆ పాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు వేణు, బీఆర్‌ఎస్‌ నాయకులు కర్రె శంకర్‌, నాయకులు బలికొండ రమేశ్‌, సీపీఐ నాయకులు లక్ష్మణ్‌, చంద్ర శేఖర్‌, ఖలీందర్‌, న్యూడెమోక్రసీ నాయకులు లాల్‌కు మార్‌, మేకల రామన్న, జాడి దేవరాజ్‌, తుడుం దెబ్బ నాయకులు గంట సత్యం, టీపీఎఫ్‌ నాయకులు జైపా ల్‌సింగ్‌, ఏఐఎఫ్‌టీయు నాయకులు పోచమల్లు, దేవి సత్యం పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 11:10 PM