Share News

మావోయిస్టులపై కేంద్రం పునరాలోచించాలి

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:13 PM

మావోయిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు కలవేన శంకర్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాల యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మావోయిస్టు లతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చల ద్వారా పరిష్కార మార్గాన్ని ఎంచు కో వాలన్నారు.

మావోయిస్టులపై కేంద్రం పునరాలోచించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలవేన శంకర్‌

సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : మావోయిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు కలవేన శంకర్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాల యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మావోయిస్టు లతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చల ద్వారా పరిష్కార మార్గాన్ని ఎంచు కో వాలన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా బూటకపు ఎన్‌ కౌంటర్‌ తర్వాత దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు నిరసన తెలిపారన్నారు. మెజార్టీ ప్రజల ఆలోచనలను కేంద్రం గౌరవించా లన్నారు. అలాగే డిసెంబరు 26న రామకృష్ణపూర్‌లో సీపీఐ వంద సంవత్స రాల శత జయంతి ముగింపు బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్ని వ ర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. జిల్లాలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తు న్న సీపీఐ సర్పంచు, వార్డు సభ్యుల అభ్యర్ధులను ప్రజలందరు గెలిపించా లని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, మేకల దాసు, మిట్టపల్లి వెంకటస్వామి, చిప్ప నర్సయ్య, బొల్లం పూర్ణిమ, రేగుంట చంద్రశేఖర్‌, చంద్రకళ, మల్లయ్య, లింగయ్య, నగేష్‌, శ్రీనివాస్‌, దుర్గరాజ్‌, రా జమొగిలి, బానేష్‌, పోచన్న పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 11:13 PM