కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్రం
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:52 AM
ఎందరో ప్రాణ త్యాగాలు చే సి సాధించుకున్న కార్మిక సంక్షేమ చట్టాలను కాలరాస్తూ కేంద్ర ప్ర భుత్వం కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా సంస్కరణలు చే స్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు.
కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్రం
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి
హాలియా, జూన 29 (ఆంధ్రజ్యోతి): ఎందరో ప్రాణ త్యాగాలు చే సి సాధించుకున్న కార్మిక సంక్షేమ చట్టాలను కాలరాస్తూ కేంద్ర ప్ర భుత్వం కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా సంస్కరణలు చే స్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. హాలియాలోని సుందరయ్య భవనలో ఆదివారం నిర్వహించిన సాగర్ నియోజకవర్గ సీఐటీయూ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎన్నో పోరాటు చేసి సాధించుకున్న 44కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోడ్‌లుగా కుదించారని విమర్శించారు. కార్మికులు సంఘం పెట్టడం, సమ్మె లు చేసే అవకాశం లేకుండా చేశారని, సమ్మె చేస్తే సస్పెండ్ చేసి కేసులు పెట్టే విధంగా పొందుపరిచారని విమర్శించారు. యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు కోడ్‌లను తీసుకొచ్చారని అన్నారు. ఒక వైపు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని, దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు వ్యవసాయ రంగాన్ని, ఇటు వ్యవసాయ, ఉపాధిహామీ రంగాన్ని దెబ్బతీసే విధంగా పార్లమెంట్‌లో నిర్ణయాలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ అరాచక విధానాలకు వ్యతిరేకంగా జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ప్రజలు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీమూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు అవుతా సైదులు, జిల్లా నాయకులు ఎస్.కె. బషీర్, వెంకట్మ, లక్ష్మమ్మ, నర్సిరెడ్డి, దుబ్బా చంద్రయ్య, రెబెల్లి వెంకటేశ్వర్లు, సయ్యద్ హుస్సేన, చిరంజీవి, వేణుగోపాల్, సైదిరెడ్డి, నన్నెసాహెబ్, అన్నెపాక శ్రీను, అనూష తదితరులు పాల్గొన్నారు.