మతోన్మాద శక్తులకు అనుకూలంగా కేంద్రం
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:51 PM
కేంద్ర ప్రభు త్వం మతోన్మాద శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ఆరోపించా రు.
నల్లగొండ రూరల్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభు త్వం మతోన్మాద శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ఆరోపించా రు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డికొమరయ్య భవనంలో బుధవారం జరిగిన సమా వేశంలో మాట్లాడారు. కార్మికులకు ప్రమాదకరంగా ఉన్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలో భాగంగా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంద న్నారు. కార్మిక వర్గ సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాల్లో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తమ కార్పొరేట్ అనుకూల విధానాలను అనుగుణంగా కేటాయింపులు చేస్తూ, సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి సామాన్యులపై భారాలలు మోపుతోందన్నారు. హమాలీ, రవాణ రంగా కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు కార్మికులకు ఉపయోగపడే విధంగా మోటార్ వాహనాల చట్టం 2019 సవరించాలన్నారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నల్లగొండ పట్టణ కన్వీనర్‌గా అవుట రవిందర్, నల్లగొండ మండల కన్వీనర్‌గా పోలే సత్యనారాయణ, తిప్పర్తి మండల కన్వీనర్‌గా భీమగాని గణేష్‌ను ఎన్నుకు న్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. సలీం అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, కే. విజయలక్ష్మి, అద్దంకి నరసింహ, కోట్ల అశోక్‌రెడ్డి, సలివోజు సైదాచారి, గంజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.