రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కేంద్రం
ABN , Publish Date - Jun 29 , 2025 | 11:28 PM
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సా రథ్యంలో కేంద్ర ప్రభుత్వం సాగు రంగం అభివృద్ధికి రైతుల సంక్షేమానికి పె ద్దపీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకులు వెర్రబెల్లి రఘునాథ్ అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తాళ్లపే టలో ఆదివారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
దండెపల్లి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సా రథ్యంలో కేంద్ర ప్రభుత్వం సాగు రంగం అభివృద్ధికి రైతుల సంక్షేమానికి పె ద్దపీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకులు వెర్రబెల్లి రఘునాథ్ అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తాళ్లపే టలో ఆదివారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం అమలు చే స్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గూర్చి ప్రజలకు వివరించారు. కరపత్రా లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ కిసాన్ స మ్మాన్ నిధి ద్వారా రైతులకు ఏడాదికి రూ. 6 వేలు, డీఏపీపై సబ్సిడీ అంద జేస్తూ సాగు రంగానికి చేయూత నిస్తుందన్నారు. పంట నష్టపోయిన రైతుల కు పరిహారం ఇచ్చేందుకు కేంద్రం ఫసల్ బీమా అమలు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వి ఫలమైందని ఆరోపించారు. ఇప్పటికే రెండు విడుతల రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టాని అన్నారు. మొత్తం మాఫీ చేయకుండానే రుణమాపీ చే శామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బందెల రవిగౌడ్, మోటపలుకుల గురువయ్య, గోపతి రాజయ్య, సిపిరిశెట్టి శ్రీనివాస్, ఎర్రం విజేందర్, దొమ్మటి వెంకటేశ్, బ త్తుల శేఖర్, బొల్లం రవీందర్, ఏడుల రమేష్ పాల్గొన్నారు.