ప్రచార జాతను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Dec 28 , 2025 | 10:45 PM
సీపీఐ వందే ళ్ల ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లాలో జనవరి 3 నుంచి 9 వ రకు జరిగే ప్రచార జాతను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహి స్తు న్నామన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : సీపీఐ వందే ళ్ల ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లాలో జనవరి 3 నుంచి 9 వ రకు జరిగే ప్రచార జాతను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహి స్తు న్నామన్నారు. ఇందులో భాగంగా ప్రచారం జాత చేపడుతున్నామని, అ లాగే జనవరి 10న రామకృష్ణపూర్‌లో ప్రదర్శన, బహిరంగ సభ ఉం టుందని, 18న ఖమ్మంలో వంద సంవత్సరాల శత జయంతి వేడుకల ముగింపు సభ ఉంటుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు రూపొందిస్తుంద న్నారు. దేశంలో వామపక్ష ఐక్యత కోసం అందరు పునరాలోచించు కోవాలన్నారు. కేంద్రం విధానాలను తిప్పికొట్టేందుకు అందరు కలిసి రా వాలన్నారు. ముగింపు సభలకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మేధా వులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, కార్యవర్గసభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, నాయకులు లింగ య్య, మల్లయ్య, మల్లేష్, శ్రీనివాస్, రవి, పౌలు, రాజు, సత్యనారాయణ, రాజమొగిలి, బా నేష్, లక్ష్మీనారాయణ, పోచన్న, రవీందర్ పాల్గొన్నారు.