Share News

గుట్టలో భక్తుల సందడి

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:12 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దివ్వ క్షేత్రంలో శనివారం శాస్త్రోక్తంగా నిత్య పూజలు నిర్వహిం చారు.

గుట్టలో భక్తుల సందడి

యాదగిరిగుట్ట, మే 31 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దివ్వ క్షేత్రంలో శనివారం శాస్త్రోక్తంగా నిత్య పూజలు నిర్వహిం చారు. స్వయం భువులు, సువర్ణ ప్రతిష్టామూర్తులను పంచామృతాలతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చించారు. ప్రాకార మండపంలో సుద ర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అష్టభుజి ప్రాకార మండపంలో స్వామిఅమ్మవారిని వేదికపై తీర్చిదిద్ది సుదర్శన శతక పఠనాలతో హవనం నిర్వహించారు. అనంతరం గజవాహన సేవలో ఊరేగించి విశ్వక్సేనుడి తొలిపూజలతో నిత్య కల్యాణోత్సవం ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రం ప్రధానాలయం ముఖ మండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు సాయంత్రం అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చనలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో నిత్యకైంకర్యాలు నిర్వహించిన అర్చకులు సాయంత్రం వెండీజోడు సేవలు, సహస్రనామార్చనలు నిర్వహించారు.

కిక్కిరిసిన ఉభయ క్యూలైన్లు

ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సు మారు 50వేల మంది భక్తులు తరలిరావడంతో ఉభయ క్యూలైన్లు కిక్కి రిశాయి. గర్భాలయంలో స్వయంభువులకు దర్శించుకున్న భక్తులు ఆల య ముఖమండపంలో ఉత్సవమూర్తుల వద్ద ప్రత్యేకపూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దసం ఖ్యలో భక్తులు వాహనాలపై రద్దీ పెరిగింది. ధర్మదర్శనం భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక దర్శన భక్తులకు గంట సమయం పట్టినట్టు భక్తులు తెలిపారు. కొండకింద, పైన బస్టాండుల్లో వాహనాల రద్దీతో భక్తుల రాకపోకలకు ఆటంకం కలిగింది. రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో బస్సుల కోసం భక్తులు పరుగులు పెట్టారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.56,14,289 ఆదాయం సమ కూరినట్లు ఈవో ఎస్‌. వెంకట్రావు తెలిపారు. తిరుమల బృందంచే భక్తి సంగీతం, దుర్గ కూచిపూడి డాన్స్‌ అకాడమీ కూచిపూడి నృత్యం కార్యక్ర మాలు నిర్వహించారు. రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ఉదయం 8.30గంటలకు ఈవో క్యాంపు కార్యాల యం వద్ద జాతీయ పతాక ఆవిష్కరించనున్నట్లు డీఈవో దోర్భల భాస్కరశర్మ తెలిపారు.

మట్టపల్లిలో నృసింహుడి కల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో రాజలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహుడి నిత్యకల్యాణాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. నిజాభిషేకం, నిత్యార్చనలు చేశారు. ఆలయ సంప్రదాయ ప్రకారం ఆర్జిత కైంకర్యాలు నిర్వహించారు. తదుపరి కల్యాణ మూర్తులను పరిణయోత్సవ వేదికపైకి వేంచేయించి పుణ్యాహవాచనం గావించారు. మధ్యాహ్నం అమ్మవారికి కుంకుమార్చన, విశేషపర్యాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:12 AM