Share News

బీఆర్‌ఎస్‌ పార్టీ పని అయిపోయింది

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:34 PM

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ పని అయిపోయిందని, ప్రస్టేషన్‌తో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రభుత్వంపై లేని పోని విమర్శలు చేస్తున్నాడని రాష్ట్ర కార్మిక, గనుల, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. శనివారం మందమర్రిలో నిర్వహించిన విలేకరుల సమావే శంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ పని అయిపోయింది
మందమర్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వివేక్‌వెంకటస్వామి

బొగ్గు గనుల వేలం పాటలతోనే సింగరేణికి భవిష్యత్తు

మంత్రి వివేక్‌వెంకటస్వామి

మందమర్రిటౌన్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ పని అయిపోయిందని, ప్రస్టేషన్‌తో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రభుత్వంపై లేని పోని విమర్శలు చేస్తున్నాడని రాష్ట్ర కార్మిక, గనుల, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. శనివారం మందమర్రిలో నిర్వహించిన విలేకరుల సమావే శంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. లోటు బడ్జెట్‌ ఉన్నా సంక్షేమపథకాలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తుందన్నారు. ఫార్ములా వన్‌ రేస్‌ కేసులో ఊ. 50 కోట్ల కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వంపై దుర్భాషలాడుతున్న కేటీఆర్‌ ఎందుకు భయపడుతున్నాడన్నారు. బీఆర్‌ఎస్‌ కుంభకో ణాల్లో మునిగిపోయిందని, కేసీఆర్‌ కూతురు కవిత చేస్తున్న ఆరోపణలకు వారి వద్ద జవాబు లేదన్నారు. ప్రభుత్వంపై విమర్శలు మానుకుని ప్రజల కోసం పనిచేస్తే హ ర్షిస్తామన్నారు. కుంభకోణాలు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. సింగరేణిలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడాలంటే తప్పనిసరిగా బొగ్గు గనుల వేలం పాటలు అవసరమన్నారు. వేలం పాటలో పాల్గొంటామని ఉపముఖ్యమంత్రి చెప్పడం హర్షిం చదగ్గ పరిణామమన్నారు. ఈ నెల 15న జరగనున్న కేబినెట్‌ సమావేశంలో ముఖ్య మంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు ఉపేందర్‌గౌడ్‌, సొత్కు సుదర్శన్‌, బండి సదానందం యాదవ్‌, ఎర్ర రాజు, రాకం సంతోష్‌, ఇసాక్‌, గణేష్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

వరద నీరు రాకుండా చర్యలు చేపడతాం

వర్షాలతో వరద నీరు చేరుతున్న కాలనీల్లో నీరు చేరకుండా తగిన చర్యలు చేపడ తామని మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం మున్సిపాలిటీలో వర్షాలకు వరద నీరు చేరిన చెంచు కాలనీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పర్యటించారు. ప్రజలను సమ స్యలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ కాలనీల్లో అర్హులైన వారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు వచ్చేలా చూస్తానని తెలిపారు. వరదల్లో నిత్యవసర సరుకులు కోల్పోయిన వారికి బియ్యం, నిత్యవసర సరుకులు అందించాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాజలింగుకు, రెవెన్యూ అధికారులకు సూచించారు. అనంతరం కాలనీ వాసులు మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. మంత్రి వెంట నాయకులు, అధికారులు ఉన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 11:35 PM