Share News

kumaram bheem asifabad- వీరనారి చాకలి ఐలమ్మ

ABN , Publish Date - Sep 26 , 2025 | 10:56 PM

వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలతో జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు.

kumaram bheem asifabad- వీరనారి చాకలి ఐలమ్మ
చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలతో జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమాధికారి సజీవన్‌, కుల సంఘాల ప్రతినిధులతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం సామాజిక చైతన్యం కోసం, బహుజనుల హక్కుల కోసం పోరాడిన తెలంగాణ వీరవనిత చాకలి ఐల మ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని జిల్లా అభివృద్ధికి అందరం కృషి చేద్దామని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, నాయకుల మల్లయ్య, రవీందర్‌, భూమయ్య, సతీష్‌, మధుకర్‌, శంకర్‌, మారుతి, సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించాలి

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో శుక్రవారం ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా సంక్షేమాఽధికారి భాస్కర్‌లతో కలిసి అన్ని శాఖల అధికారులతో బతుకమ్మ పండగ సంబరాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన ఆవరణ బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించాలని తెలిపారు. ఈ వేడుకల్లో కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారులు, ఉద్యోగులు, మహిళా సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. మున్సిపాలిటీలలో బతుకమ్మ సంబరాలపై హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. బతుకమ్మ ముగింపు రోజున అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. బతుకమ్మ ఆడే ప్రదేశాలు, నిమజ్జనం చేసే చెరువులు, వాగుల వద్ద పారిశుధ్యం పనులు చేపట్టాలన్నారు. విద్యుత్‌ దీపాలు ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

Updated Date - Sep 26 , 2025 | 10:56 PM