kumaram bheem asifabad- విరబూసిన బ్రహ్మకమలం
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:05 PM
బ్రహ్మకమలం ఇది ఒక అరుదైన పుష్పం. రాత్రి పూట వికసించి ఉదయాన్నే వాడిపోవడం దీని ప్రత్యేకత. ఈ అరుదైన ఈ పుష్పం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలోని చెడ్వాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చౌదరి సుజాత, శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం రాత్రి వికసించింది. హిమాలయ పర్వతాల్లో కనిపించే ఈ అరుదైన మొక్కను మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో కొనుగోలు చేసి ఇంటి ఆవరణలో నాటారు. ఇప్పుడు ఈ పుష్పం వికసించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెంచికలపేట, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): బ్రహ్మకమలం ఇది ఒక అరుదైన పుష్పం. రాత్రి పూట వికసించి ఉదయాన్నే వాడిపోవడం దీని ప్రత్యేకత. ఈ అరుదైన ఈ పుష్పం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలోని చెడ్వాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చౌదరి సుజాత, శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం రాత్రి వికసించింది. హిమాలయ పర్వతాల్లో కనిపించే ఈ అరుదైన మొక్కను మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో కొనుగోలు చేసి ఇంటి ఆవరణలో నాటారు. ఇప్పుడు ఈ పుష్పం వికసించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శివుడికి ప్రీతిపాత్రమైన పుష్పంగా పురుణాల్లో ఉందని, ఏడాదిలో ఒక సారి మాత్రమే అది రాత్రివేళల్లో పూస్తుందని చెబుతున్నారు. రాత్రివేళల్లో శ్వేత వర్ణంలో పెద్దగా వికసించే ఈ పూలు ఉదయానికి మొగ్గలా ముడుచుకుంటాయి.