బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:02 PM
తె లంగాణ రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజ ర్వేష న్ అమలుకు వ్యతిరేకంగా ఉన్న కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు అన్నారు.
- సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు
కల్వకుర్తి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : తె లంగాణ రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజ ర్వేష న్ అమలుకు వ్యతిరేకంగా ఉన్న కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు అన్నారు. శనివారం కల్వకుర్తిలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ బీసీలకు 42శాతం రి జర్వేషన్ల అమలు జీవోతో పాటు స్థానిక సంస్థల నిర్వహణపై హైకోర్టు స్టే విధించడంతో ఎన్ని కల ప్రక్రియ నిలిచిపోవడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళల హక్కులను కాలరాస్తోందని ఆరోపిం చారు. రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించుకోవడానికి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. శ్రీనివాస్, బి.ఆంజనేయులు, సి.ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఏపీ మల్లయ్య, బాల స్వామి, శంకర్‌నాయక్, శి వవర్మ, నాయకులు మధు, రాములు పాల్గొన్నారు.