Share News

భూ భారతి చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి

ABN , Publish Date - May 20 , 2025 | 11:34 PM

కాంగ్రెస్‌ ప్రభు త్వం తీసు కువచ్చిన భూ భారతి చట్టాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని, పేదలు, భూములున్నవారికి న్యాయం జరిగేలా చర్యలు తీ సుకునే బాధ్యత అధికారులపై ఉందని రెవెన్యూ, గృహనిర్మాణ, సమా చార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

భూ భారతి చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి
సభలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి

అధికారులు తప్పుచేస్తే వదిలే సమస్యే లేదు

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

మంచిర్యాల, మే 20 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభు త్వం తీసు కువచ్చిన భూ భారతి చట్టాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని, పేదలు, భూములున్నవారికి న్యాయం జరిగేలా చర్యలు తీ సుకునే బాధ్యత అధికారులపై ఉందని రెవెన్యూ, గృహనిర్మాణ, సమా చార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. జిల్లాలోని భీమారం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజర య్యారు. కాంగ్రెస్‌ పేదల ప్రభుత్వమని, ప్రజలు, సామాన్యులకు క్షేత్ర స్థాయిలో న్యాయం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచిం చారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి వల్ల అనేక మంది రైతులు, ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని, తమ సమస్యలు ఎవరికి చెప్పు కోవాలో కూడా తెలియక ఆవేదన చెందారని మంత్రి అన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం భూ భారతి చట్టానికి రూపకల్పన చేసిందన్నారు. ధరణిలో సాదాబైనా మాల స మస్యలకు పరిష్కారం చూపలేదని, భూ భారతి చట్టంలో వాటిని పరిగణలోకి తీసుకొని పరిష్కరించేవిధంగా చట్టాన్ని రూపొం దించా మన్నారు. భూభారతిలో భాగంగా మొదట రాష్ట్రంలోని నాలుగు మం డలాలను పైలట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకొని సమస్యలపై దరఖాస్తులు స్వీ కరించినట్లు తెలిపారు. ఆయా మండలాల్లో 2200ల దరఖాస్తులు రా గా, అందులో 1100ల వరకు సాదాబైనామాల సమస్యలే ఉన్నాయ న్నారు. ప్రభుత్వ స్థలాలను సాగు చేస్తున్న అర్హులకు జూన్‌ 2వ తేదీ న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పట్టాలు అందజేస్తామని, ఈ విషయంలో పూర్తిస్థాయిలో స ర్వే జరపాలను వేదికపై ఉన్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ను ఆదేశించారు. భూ భారతి చట్టంలో స్వీకరించిన దరఖాస్తు అధికారులే పరిష్కరిం చాలని, అధికారులు తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకునేవిధంగా చట్టంలో పొందుపర్చినట్లు చెప్పారు. భూముల రిజిస్ర్టేషన్‌ సమ యంలో సర్వే మ్యాప్‌ను కూడా పొందుపరిచి పాసుపుస్తకాలు జారీ చేస్తామన్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఎవరికి కూడా లంచం ఇవ్వవద్దని సూచించారు. ధరణిలో అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకొని అర్హులకు పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు. ఈ నెలాఖరు లోపు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ ప్రారంభిస్తామని, మొదటి విడతగా 4.5 లక్షల ఇళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపా రు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ అవసరం మేరకు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సల హాదారు హర్కర వేణుగోపాల్‌ రావు, చెన్నూర్‌, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్‌, గడ్డం వినోద్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కుమార్‌, గిరిజన అభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొట్నాక తిరుపతి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతీ లాల్‌, డీసీపీ ఎగ్గడి భాస్కర్‌తో పాటు చెన్నూరు నియోజక వర్గంలోని తహశీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 11:34 PM